Congress Yatra in Tandur : కేసీఆర్, కేటీఆర్… కర్ణాటకకు రండి, మీకు దగ్గరుండి చూపిస్తా - డీకే శివకుమార్ సవాల్-telangana congress second phase of vijayabheri yatra in tandoor ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Yatra In Tandur : కేసీఆర్, కేటీఆర్… కర్ణాటకకు రండి, మీకు దగ్గరుండి చూపిస్తా - డీకే శివకుమార్ సవాల్

Congress Yatra in Tandur : కేసీఆర్, కేటీఆర్… కర్ణాటకకు రండి, మీకు దగ్గరుండి చూపిస్తా - డీకే శివకుమార్ సవాల్

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 28, 2023 10:17 PM IST

Congress Vijayabheri Yatra: కాంగ్రెస్ రెండో విజత విజయభేరి యాత్ర తాండూరు నుంచి మొదలైంది. ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన డీకె శివకుమార్ మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలునిచ్చారు. దమ్ముంటే కేసీఆర్ ఓసారి కర్ణాటకకు రావాలని సవాల్ విసిరారు.

తాండూరులో విజయభేరి యాత్ర
తాండూరులో విజయభేరి యాత్ర

Telangana Congress Vijayabheri Yatra: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పకడ్బందీ అడుగులు వేస్తోంది. మొదటి విడత బస్సు యాత్ర విజయవంతం కావటంతో… తాండూరు నుంచి రెండో విడత యాత్రను ప్రారంభించింది. శనివారం నుంచి మొదలైన ఈ యాత్రకు… ముఖ్య అతిథిగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కాంగ్రెస్ కృషితోనే తెలంగాణ రాష్ట్ర సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా… కేసీఆర్ కు సవాల్ విసిరారు.

yearly horoscope entry point

డీకె శివ కుమార్ ప్రసంగం:

- తొమ్మిదేళ్ల క్రితం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. రాజకీయాల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది. అలాంటి పార్టీకి మద్దతుగా నిలవాల్సిన సమయం వచ్చింది. మీరంతా ఆలోచించాలి.

- కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చింది. కానీ పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్ని హామీలను అమలు చేశారని ప్రశ్నిస్తున్నాను..?

- కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ప్రతి ఒకటిని అమలు చేస్తున్నాం. కేసీఆర్ పదేళ్లలో ఏమైనా చేశారా..?

- తెలంగాణలో ఆరు హామీలను ఇచ్చాం. కాంగ్రెస్ లో ఐదు హామీలను ఇచ్చి అమలు చేశాం. ఇక్కడి కూడా చేస్తాం. కేసీఆర్ ఒకసారి కర్ణాటకకు వచ్చి చూడు.

- కర్ణాటకలో ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. తెలంగాణలో కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెబుతున్నాను. కర్ణాటకలో ఉచితంగా పది కేజీల బియ్యం కూడా ఇస్తున్నాం.

- తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... డిసెంబర్ 9వ తేదీన జన్మదినం సందర్భంగా ప్రతి హామీని అమలు చేసేలా సంతకం చేస్తాం. అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థి ప్రమాణస్వీకారం ఉంటుంది.

- బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీటీమ్ లా పని చేస్తుంది.

- కర్ణాటకలో మేం ప్రస్తుతం 5 గంటల కరెంట్ ఇస్తున్నాం. త్వరలోనే 7 గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం.

- నేను కేసీఆర్, కేటీఆర్ ను అడుగుతున్నాను. మీరు కర్ణాటకకు రండి, మేం ఏం చేశామో చూడండి. టైం చెప్పండి. మీతో కూడా నేను వస్తాను. విద్యుత్ ఎలా ఇస్తున్నామో కూడా చూపిస్తాను.

-ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తాం. చదువుకునే వారికి ఆర్థిక సాయం అందిస్తాం.

-రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం.

-డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.

Whats_app_banner