Munugodu Bypoll : మునుగోడు విషయంలో అలా చేయవద్దని కాంగ్రెస్ ఫిక్స్ అయిందా..?-telangana congress new strategy in munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu Bypoll : మునుగోడు విషయంలో అలా చేయవద్దని కాంగ్రెస్ ఫిక్స్ అయిందా..?

Munugodu Bypoll : మునుగోడు విషయంలో అలా చేయవద్దని కాంగ్రెస్ ఫిక్స్ అయిందా..?

HT Telugu Desk HT Telugu
Sep 15, 2022 09:23 PM IST

congress on munugodu bypoll 2022: మునుగోడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. సిట్టింగ్ స్థానం కావటం కాదు చావోరేవోగా మారిపోయింది. అయితే ఈ బైపోల్ విషయంలో వ్యూహన్ని మార్చి ముందుకెళ్తోంది.

మునుగోడు ఉప ఎన్నిక,
మునుగోడు ఉప ఎన్నిక,

Munugode bypoll congress candidate: పాల్వాయి స్రవంతి, చలిమల కృష్ణారెడ్డి, పల్లె రవి కుమార్ గౌడ్, కైలాష్ నేత... ఈ పేర్ల చుట్టే మునుగోడు కాంగ్రెస్ రాజకీయం నడిచింది. వీరిలో ఎవరికి టికెట్ అనే దానిపై తెగ చర్చలు చేసింది. ఫైనల్ గా బంతిని అధిష్టానం కోర్టులోకి పంపింది. అయితే వీరిలో పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. అంతేనా ఓ కార్యాచరణను కూడా ప్రకటించింది. ఈనెల 18 నుంచి నేతలంతా మునుగోడులోనే ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ నిర్ణయాల వెనక పలు కారణాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

ప్రచారం ముమ్మరం..!

ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఉప ఎన్నికల(దుబ్బాక, హుజురాబాద్) ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారానికి రెడీ అయ్యింది. టీఆర్ఎస్-బీజేపీ పార్టీలకు దీటుగా ప్లాన్లు వేస్తూ.. సిట్టింగ్ సీటును కైవసం చేసుకునేలా నిర్ణయాలు తీసుకుంటింది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టడం ద్వారా కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగు పరచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ నేపథ్యంలో మునుగోడులోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లను నియమించింది. ఈనెల 18వ తేదీ నుంచి ప్రచారాన్ని హోరెత్తించాలని.. నేతలంతా అక్కడే మోహరించేలా ప్లాన్ చేసేసింది. మరోవైపు అభ్యర్థి విషయంలో ఓ క్లారిటీతో నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎంపికైన అభ్యర్థి కూడా పాల్వాయి స్రవంతి కూడా....నేతలందర్నీ సమన్వయం చేసుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్వయంగా ఇంటికి వెళ్లి కలిశారు. ఎన్నికల ప్రచారానికి రావాలని స్రవంతి కోరగా వస్తానని ఎంపీ కోమటి రెడ్డి మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కూడా పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చేలా మారిందనే టాక్ వినిపిస్తోంది.

ఆశావాహులతో భేటీ...

ఎన్నికల వ్యూహాలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు టికెట్ ఆశించిన అసంతృప్త నేతలతో పాల్వాయి స్రవంతి కూడా భేటీ అయ్యారు. టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ లతో చర్చించారు. వారికి సర్దిచెప్పి... పార్టీ విజయం కోసం పని చేసేలా మాట్లాడారు. పలు అంశాలపై సీనియర్ నేతలు కూడా దిశానిర్దేశం చేశారు.

గత ఉప ఎన్నికలో చవి చూసిన ఓటమి, అందుకు గల పరిణామాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్... మునుగోడు విషయంలో ఓ క్లారిటీతో ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అభ్యర్థిని ఫైనల్ చేయటం,అసంతృప్త రాగాలకు స్కోప్ ఇవ్వకండా చర్చలు జరపడం, ప్రచార కార్యాచరణను ప్రకటించటం ద్వారా మునుగోడు విషయంలో ఏ చిన్న తప్పిదానికి చోటు ఇవ్వొద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన వ్యూహ ప్రతి వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటోంది.

ప్రతి చిన్న అంశాన్ని క్లీన్ గా పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం... మునుగోడులో బీజేపీ,టీఆర్ఎస్ కి ఝలక్ ఇస్తుందా..? సిట్టింగ్ సీటు కాపాడుకోని వచ్చే ఎన్నికల రణరంగంలోకి దిగుతుందా..? లేక మరో ఓటమి ఖాతాలో వేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం