తెలుగు న్యూస్ / ఫోటో /
Ambedkar Statue : నగరం నడిబొడ్డున విశ్వ విజ్ఞానమూర్తి.. 125 అడుగుల స్టాచ్యూ ప్రత్యేకతలివే
- 125 Ft Tall B.R. Ambedkar Statue in Hyderabad : దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ వేదికైంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల గల ఈ విగ్రహా ప్రత్యేకతలు ఏంటో చూద్దాం……

(1 / 5)
ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ప్రత్యేక అతిధిగా హాజరవుతారు. ఈ విగ్రహ స్థాపనకు ఏప్రిల్ 14 , 2016 లో శంకు స్థాపన చేశారు. 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం. భూమి నుండి 175 అడుగుల ఎత్తు. పీఠం ఎత్తు 50 అడుగులుగా ఉంది.(twitter)
(2 / 5)
ఇది దేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. 2 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం పనులు చేపట్టారు. బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు. వినియోగించిన స్టీల్ 791 టన్నులు. ఇత్తడి 96 మెట్రిక్ టన్నులుగా ఉంది.(twitter)
(3 / 5)
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహం రూపకల్పన చేశారు. మొత్తం వ్యయం రూ.146 .50 కోట్లు. పని చేసిన శ్రామికులు 425 మంది. విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వంజి సుతార్. 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం. అంబేద్కర్ స్మృతివనంలో రాక్ గార్డెన్ నిర్మించారు. (twitter)
(4 / 5)
ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ఎంట్రెన్స్, వాటర్ ఫౌంటేన్స్ , సాండ్ స్టోన్ వర్క్, జిఆర్‌సి, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్ సౌకర్యం ఉంది. విగ్రహానికి చేరుకోడానికి మెట్ల దారి, ర్యాంప్ నిర్మించారు. విగ్రహం కింద పీఠం లోపల గ్రంథాలయం ఏర్పాటు చేసి దానిలో అంబేద్కర్ రచనలు అందుబాటులో ఉంటాయి.(twitter)
ఇతర గ్యాలరీలు