Operation Cheyutha: భద్రాద్రి జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు, సత్ఫలితాలిస్తున్న "ఆపరేషన్ చేయూత"-surrender of 3 maoists in bhadradri district operation shayutha succeeding ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Operation Cheyutha: భద్రాద్రి జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు, సత్ఫలితాలిస్తున్న "ఆపరేషన్ చేయూత"

Operation Cheyutha: భద్రాద్రి జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు, సత్ఫలితాలిస్తున్న "ఆపరేషన్ చేయూత"

HT Telugu Desk HT Telugu
May 21, 2024 05:54 AM IST

Operation Cheyutha: భద్రాద్రి జిల్లాలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూత సత్ఫలితాలనిస్తోంది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి ప్రాధాన్యమిస్తున్నారు.

భద్రాద్రిలో లొంగిపోయిన మావోయిస్టులు
భద్రాద్రిలో లొంగిపోయిన మావోయిస్టులు

Operation Cheyutha: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. ఏటూరునాగారం - మహాదేవపూర్ ఏరియా కమిటీ సభ్యుడు కోవాసి గంగా@మహేష్ @జనార్ధన్, సోడి ఉంగి@ఝాన్సీ, కలుమ బుద్రలు లొంగిపోయారు. వీు కిష్టారం PS ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. చత్తీస్‌ఘడ్‌లోని సుకుమా జిల్లాకు చెందిన వీరు ముగ్గురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు.

yearly horoscope entry point

కోవాసి గంగ @ మహేష్ 2009 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై ఏటూరునాగారం - మహాదేవపూర్ ఏరియా కమిటీలో మిలిషియా సభ్యుడిగా చేరి 2015 లో ACM గా పదోన్నతి పొందాడు. ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ పద్దతుల పట్ల విరక్తి చెంది లొంగిపోవాలని నిర్ణయించుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

సోడి ఉంగి@ఝాన్సీ 2019 సంవత్సరంలో నిషేధిత మావోయిస్టు పార్టీ ఏటూరు నాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీలో దళ సభ్యురాలుగా చేరి, అదే కమిటీకి సభ్యుడిగా పని చేస్తున్న కోవాసి గంగ @ మహేష్ ను వివాహం చేసుకుంది. మావోయిస్ట్ పార్టీ పద్దతులు నచ్చక, మెరుగైన జీవితాన్ని గడపడానికి తన భర్తతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయింది.

కలమ బుద్ర తన చిన్న వయసులోనే అంటే 2002 సంవత్సరంలో నిషేధిత మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా చేరి, ఒక సంవత్సరం తర్వాత చైతన్య నాట్య మండలి (CNM)లో 10 సంవత్సరాల పాటు కళాకారుడిగా, గాయకుడిగా పని చేశాడు. ప్రస్తుతం పుట్టపాడు గ్రామం DAKMS అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.

గత కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదివాసి ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి చత్తీస్గడ్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా, కమిటీలను ఏర్పాటు చేసి బలవంతపు వసూల్లే లక్ష్యంగా పని చేస్తూ, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.

ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ గ్రహించిన ఈ ముగ్గురు పార్టీని వీడి సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ నాయకుల వేదింపులు భరించలేక చాలా మంది దళ సభ్యులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.

సత్ఫాలితాన్నిస్తున్న ఆపరేషన్ చేయూత..

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నేతృత్వంలో చేపట్టిన "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం ద్వారా కౌన్సిలింగ్ కు హాజరైన కుటుంబ సభ్యులు మావోయిస్ట్ పార్టీలో పని చేస్తున్న వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమం మంచి సత్ఫలితాలనిస్తుంది.

లొంగిపోయి సాధారణ జన జీవనం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, స్వయంగా గాని తమ దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్లో గానీ, జిల్లా ఉన్నతాధికారులను గానీ సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. లొంగిపోయే దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరుపున అండాల్సిన అన్ని రకాల ప్రతి ఫలాలను అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.)

Whats_app_banner

సంబంధిత కథనం