Davos | తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఏసియన్-పసిఫిక్ రీజియన్ కు ఇక్కడి నుంచే ఎగుమతి-stadler rail medha servo drives to set up rail coach manufacturing unit in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Davos | తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఏసియన్-పసిఫిక్ రీజియన్ కు ఇక్కడి నుంచే ఎగుమతి

Davos | తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఏసియన్-పసిఫిక్ రీజియన్ కు ఇక్కడి నుంచే ఎగుమతి

HT Telugu Desk HT Telugu
May 25, 2022 03:49 PM IST

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతోంది. దావోస్ పర్యటనలో భాగంగా.. స్టాడ్లర్ రైల్ కంపెనీతో ఒప్పంది కుదిరింది.

<p>స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ తో కేటీఆర్</p>
స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ తో కేటీఆర్ (twitter)

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ సంస్థ ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నాయి. స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్ లో అవగాహన ఒప్పందంపై మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు చేశారు.

తయారీ కేంద్రంలోకి రెండు సంవత్సరాల వ్యవధిలో రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుంది స్టాడ్లర్. ఈ యూనిట్ తో 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కేంద్రం స్టాడ్లర్, మేధా సర్వోలకు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఇది భారతదేశం నుండి మాత్రమే కాకుండా, ఏసియన్-పసిఫిక్ ప్రాంతంలోని వినియోగదారులకు కూడా ప్రాథమికంగా ఎగుమతి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు.

రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ నుంచి భారతదేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా రైల్వే కోచ్ లను తయారు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితం అయిందని పేర్కొ్న్నారు. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందని.., 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

'భారతదేశంతోపాటు APAC ప్రాంతంలో కార్యకలాపాలను పెంచడానికి మేం ప్లాన్ చేస్తున్నాం. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే.. యూనిట్ మాకు అత్యంత ముఖ్యమైన కేంద్రాలలో ఒకటిగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అందించిన మద్దతుతో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఏసియా పసిఫిక్ ప్రాంతంలో మా కంపెనీ అభివృద్ధి సాధించేందుకు ఈ పెట్టుబడి ఎంతగానో ఉపయోగపడుతుంది.' అని స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్ అన్నారు.

Whats_app_banner