ST reservations : తెలంగాణలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు-st reservations quota increased in telangana state 6 to 10 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  St Reservations Quota Increased In Telangana State 6 To 10 %

ST reservations : తెలంగాణలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు

B.S.Chandra HT Telugu
Oct 01, 2022 06:04 AM IST

ST reservations తెలంగాణలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో జరిగిన ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనంలో గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు పక్షం రోజుల్లోనే రిజర్వేషన్లు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేశారు.

తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంపు
తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంపు (twitter)

ST reservations తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ను పెంచుతూ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబరు 1 శనివారం నుంచి పెరిగిన రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంచనుంది.

ట్రెండింగ్ వార్తలు

న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్లపైనా అధ్యయనం చేశాక, అన్ని రకాల వివాదాలకు సమాధానమిచ్చేలా ప్రభుత్వం ST reservations పై నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు 6శాతంగా ఉన్న రిజర్వేషన్‌నే తెలంగాణ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. అయితే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గిరిజన జనాభాకు అనుగుణంగా ST reservations పెంచుతామంటూ సీఎం కేసీఆర్‌ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగా 2017లోనే రాష్ట్ర శాసనసభ, గిరిజన రిజర్వేషన్‌ పెంపు బిల్లునుఆమోదించి కేంద్రానికి పంపించింది.

తెలంగాణ శాసన సభ అమోదించిన బిల్లులో ST reservations 6 నుంచి 10 శాతానికి పెంచడంతోపాటు ముస్లింలకు అప్పటి దాకా ఉన్న 4 శాతం రిజర్వేషన్‌ను కూడా 12 శాతానికి పెంచుతూ ప్రతిపాదించింది. అయితే ఈ మొత్తం కలిపి 62 శాతానికి చేరడం, రిజర్వేషన్ల మొత్తం 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. మరోవైపు ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్‌పై గతంలోనే ఉన్నత న్యాయస్థానాలు స్టే ఇచ్చాయి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు కావడంతో స్టే ఇచ్చింది.

ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వేషన్ల వాటా 46 శాతం మాత్రమే అమల్లో ఉన్నట్లవుతోంది. తాజాగా ఎస్టీలకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్‌ను పెంచడం ద్వారా తిరిగి 50 శాతం కానుంది. దీంతో ఇప్పటికిప్పుడు న్యాయపరంగా కూడా అడ్డంకులు రావన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.

ST reservations విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట‌ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేశారు. గిరిజ‌నులకు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తూ నోటిఫికేష‌న్ జారీ చేశారు. గత నెల 17న జ‌రిగిన ఆదివాసీ, గిరిజ‌నుల ఆత్మీయ స‌భ‌లో చేసిన ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా నోటిఫికేష‌న్ జారీ చేశారు.

రాష్ట్రంలో గిరిజ‌నుల జ‌నాభాకు అనుగుణంగా ST reservations 10 శాతానికి పెంచాల‌ని గతంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించినా అది కేంద్రం అమోదం పొందలేదు. ఈ నెల 17న జ‌రిగిన ఆత్మీయ స‌భ‌లో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం కేసీఆర్ గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ద‌శాబ్దాలుగా అణ‌చివేత‌కు, దోపిడీకి గురైన గిరిజ‌నులకు న్యాయం చేసేందుకు రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. త‌మిళ‌నాడులో మొత్తం రిజ‌ర్వేష‌న్లు 1994లో 50 శాతాన్ని దాటి 69 శాతానికి పెరిగిపోయిన అంశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశీలించిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

28ఏళ్ళుగా త‌మిళ‌ నాడులో 69 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల్లోనే ఉన్నాయి. త‌మిళ‌నాడులో పెరిగిన రిజ‌ర్వేష‌న్ల‌ను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చ‌డం ద్వారా కేంద్రం రాజ్యాంగ బ‌ద్ధ‌త క‌ల్పించింది. తమిళనాడు మాదిరి తెలంగాణలో గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని ప‌దేప‌దే తెలంగాణ ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు.

IPL_Entry_Point