Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, లింగంపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు-south central railway special trains september 1 to 14th between kakinada lingampalli ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, లింగంపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, లింగంపల్లి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

Bandaru Satyaprasad HT Telugu
Aug 27, 2023 07:04 PM IST

Special Trains : సెప్టెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకూ కాకినాడ-లింగంపల్లి మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

Special Trains : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు నెంబర్ 07439 కాకినాడ టౌన్‌- లింగంపల్లి రైలు సెప్టెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని అధికారులు తెలిపారు. స్పెషల్ రైలు కాకినాడలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు లింగపల్లి చేరుకుంటుందని పేర్కొన్నారు. లింగంపల్లి-కాకినాడ (రైలు నెం.07440) సెప్టెంబర్‌ 2 నుంచి 14 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రైళ్లు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి స్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుతుందని తెలిపారు. స్పెషల్ ట్రైన్స్ సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

విజయవాడ డివిజన్ లో రైళ్లు రద్దు

విజ‌య‌వాడ డివిజ‌న్ లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు ర‌ద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దైన, దారి మ‌ళ్లించిన రైళ్ల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో పెద్ద డివిజ‌న్ గా ఉన్న విజ‌య‌వాడలో టెక్నికల్ సమస్యల కారణఁగా ఈ మ‌ధ్య త‌ర‌చుగా రైళ్లను ర‌ద్దు చేస్తున్నారు. విజ‌య‌వాడ మీదుగా దూర‌ ప్రాంతాలకు నడిచే స‌ర్వీసులు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. రైల్వే ప్రాజెక్టులు, ఇంటర్ లాకింగ్ సిస్టమ్ పనుల కారణంగా ఇటీవల త‌ర‌చుగా రైళ్లను ర‌ద్దు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల‌ు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్‌ లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ వరకు పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ డివిజన్లలో మౌలిక సదూపాయాల పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు.

తాత్కాలికంగా రద్దైన ఎంఎంటీఎస్ రైళ్లు

  • రైలు నెం. 47129 -లింగంపల్లి-హైదరాబాద్
  • రైలు నెం. 47105 -హైదరాబాద్-లింగంపల్లి
  • రైలు నెం. 47105 - ఫలక్‌నుమా-లింగంపల్లి
  • రైలు నెం. 47189 -లింగంపల్లి-ఉమ్దానగర్
  • రైలు నెం. 47181 -లింగంపల్లి-ఉమ్దానగర్ –హైదరాబాద్
  • రైలు నెం. 47114 -హైదరాబాద్-లింగంపల్లి

Whats_app_banner