Peddapally Biryani: బిర్యానీలో ఉంగరం.. అవాక్కైన కస్టమర్… వినియోగదారుల ఆగ్రహం-ring in biryani surprised customer in peddapally district manthani ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddapally Biryani: బిర్యానీలో ఉంగరం.. అవాక్కైన కస్టమర్… వినియోగదారుల ఆగ్రహం

Peddapally Biryani: బిర్యానీలో ఉంగరం.. అవాక్కైన కస్టమర్… వినియోగదారుల ఆగ్రహం

HT Telugu Desk HT Telugu

Peddapally Biryani: పెద్దపల్లి జిల్లాలో బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌‌కు అందులో ఓ ఉంగరం కూడా కనిపించడంతో షాకయ్యాడు. దీనిపై వినియోగదారులు హోటల్‌ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంథనిలో బిర్యానీలో ప్రత్యక్షమైన ఉంగరం

Peddapally Biryani: నెక్కొండ ఉదంతం మరువక ముందే పెద్దపల్లి జిల్లా బిర్యానీలో ఉంగరంలో ప్రత్యక్షమై కస్టమర్స్‌ అవాక్కయ్యేలా చేసింది. బిర్యానీ అనగానే లొట్టలేసుకుంటు తినేస్తారు కానీ మంథనిలో ఓ హోటల్లో బిర్యానీని చూసి కళ్ళు అప్పగించి చూస్తూ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెద్దపల్లి జిల్లా మంథని లో కృష్ణ బార్ Bar అండ్ రెస్టారెంట్‌లో బిర్యానీలో ఉంగరం Ring in Biryani దర్శనమిచ్చింది. మద్యం మత్తులో ఉన్న బిర్యానీ ప్రియులకు ఏమి కనిపించదని భావించారో ఏమో కానీ చేతి ఫింగర్ కు ఉండాల్సిన ఉంగరం బిర్యానీ లో కనిపించడంతో అవాక్కైన కస్టమర్ రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీశారు.

రెస్టారెంట్ నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. వంట మాస్టర్ లేదా వర్కర్ నిర్లక్ష్యం వల్లే బిర్యానీ లో ఉంగరం వచ్చిందని..సరైన పరిశుభ్రత పాటించకపోవడంతోనే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఫుడ్ సెప్టీ, మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బిర్యానీ లో ఉంగరంపై మంథని Manthani మున్సిపల్ అధికారులు ఆరా తీసి రెస్టారెంట్ పై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

నెక్కొండలో మరీ దారుణం…

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. జనాలకు అమ్మే ఐస్ క్రీమ్స్ లో ఓ తోపుడు బండి వ్యాపారి మూత్రంతో పాటు వీర్యం కలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

వరంగల్ జిల్లాలో అతి జుగుప్సా కరమైన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఫలుదా ఐస్ క్రీమ్ బిజినెస్ చేసే ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం కలపడం కలకలం సృష్టిస్తోంది. వింటేనే వాంతులు వచ్చే దారుణమైన ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ ల్ జరగగా.. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

దీంతో పోలీసులు ఆ వ్యాపారిని అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా నెక్కొండ మండల చుట్టుపక్కలా బాలాజీ కంపెనీ పేరుతో కొంతకాలంగా ఫలుదా ఐస్ క్రీమ్ బిజినెస్ నడుస్తోంది.

కొందరు మండల కేంద్రంలో, మరికొందరు చుట్టూ పక్కల గ్రామాలు తిరుగుతూ ఫలుదా ఐస్ క్రీమ్స్, జ్యూస్ లు అమ్ముతున్నారు. కాగా నెక్కొండ మండల కేంద్రంలో అంబెడ్కర్ సెంటర్ వద్ద ఫలుదా, కుల్ఫీ అమ్ముతున్న రాజస్థాన్ కి చెందిన రామ్ అనే ఓ వ్యక్తి దారుణమైన పని చేశాడు.

మిట్ట మధ్యాహ్నం జనాలు రాకపోకలు సాగిస్తుండగానే వికృత చేష్ట కు పాల్పడ్డాడు. ఐస్ క్రీమ్ అమ్మే బండి వద్దే హస్త ప్రయోగం చేసి, జనాలకు అమ్మే ఐస్ క్రీమ్, జ్యూస్ లలో వీర్యం, మూత్రం కలిపాడు. ఆ వ్యక్తి అంతటి దారుణానికి ఒడిగట్టగా.. పక్కనే ఉన్న ఓ వ్యక్తి కిరాతకమైన ఈ ఘటనను వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త వైరల్ అయింది.

పోలీసుల అదుపులో నిందితుడు

ఫలుదా ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం కలుపుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొందరు సామాజిక కార్యకర్తల వివిధ సోషల్ మీడియా వేదికల్లో అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ, పోలీస్ అధికారులు మంగళవారం సాయంత్రం నెక్కొండలోని ఫలుదా బిజినెస్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రతినిధి)

సంబంధిత కథనం