Rajeev Vardhanti: సోమాజిగూడలో రాజీవ్‌కు రేవంత్ రెడ్డి నివాళులు, న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో రాజీవ్ గాంధీ వర్థంతి..
Rajeev Vardhanti: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగడా సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహానికి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.
Rajeev Vardhanti: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మంత్రివర్గ సహచరులతో కలిసి సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
భారత దేశ మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు.
పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి ఆనాడు చేపట్టిన కార్యాచరణలో భాగంగానే ఈరోజు భారతదేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించడానికి కారణమైందని చెప్పారు .
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం తేవడానికి కూడా నేరుగా ఢిల్లీ నుండి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి , పల్లెలు బాగుండాలని ఆశించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం మన బాధ్యత అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పిలుపునిచ్చారు.