TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్ సైట్ లో సరికొత్త ఆప్షన్, ఇలా చేసుకోవచ్చు
TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వెబ్ సైట్ లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆప్షన్ తో
TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ - 2024 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రూ. 2 వేల ఫైన్ తో అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం ఉండగా… మే 23వ తేదీతో ముగుస్తుంది. జూన్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది.
వెబ్ సైట్ లో కొత్త ఆప్షన్…..
తెలంగాణ లాసెట్ - 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వెబ్ సైట్ లో సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఎల్ఎల్ బీ మూడేళ్ల కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు…. పరీక్షా కేంద్రం మార్పునుకు రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కేవలం ఒక్క సారి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
సెంటర్ మార్పు… రిక్వెస్ ప్రాసెస్ ఇదే….
తెలంగాణ లాసెట్ 2024 మూడేళ్ల కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు…. అప్లికేషన్ ప్రాసెస్ టైమ్ లో పరీక్షా కేంద్రాలను ఎంచుకుంటారు. అయితే వీటిని మార్పు చేసుకునేందుకు అధికారులు రిక్వెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చారు. అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు.
- మూడేళ్ల కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే Request for Test Centre change for LL.B. 3 Years Course ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- మీ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ కేంద్రం మార్పునకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు,
- కేవలం ఒక్కసారి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. సబ్మిట్ అయ్యాక… మళ్లీ ఓపెన్ కాదు.
TS LAWCET 2024 APPLICATION CORRECTIONS: కరెక్షన్ విండో…
మరోవైపు లాసెట్ అప్లికేషన్ల కరెక్షన్ విండో కూడా ఓపెన్ అయింది. మీ వివరాలను తప్పుగా ఎంట్రీ చేసి దరఖాస్తు చేసినట్లు అయితే…ఈ కరెక్షన్ విండో ఆప్షన్ తో సరి చేసుకోవచ్చు. https://lawcet.tsche.ac.in/TSLAWCET/TSLAWCET_TestPreference_Update.aspx లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు.
మూడు సెషన్లలో పరీక్షలు……
- జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలు జరుగుతాయి.
- ఉదయం 9 నుంచి 10.30 వరకు మొదటి సెషన్ ఉంటుంది.
- మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.
- సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ జరుగుతుంది.
- తొలి రెండు సెషన్లలో మూడేండ్ల లా కోర్సు ప్రవేశాలకు పరీక్షను నిర్వహిస్తారు.
- చివరి సెషన్‌లో ఐదేళ్ల లా కోర్సు, పీజీఎల్‌సెట్ పరీక్షలు ఉంటాయి.
How to apply For TS LAWCET 2024: ఇలా దరఖాస్తు చేసుకోండి….
- అర్హత గల అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- TS LAWCET & TS PGLCET 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- తొలుత పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- STEP 2:Fill Application Form అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై నొక్కి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- సబ్మిట్ బటన్ నొక్కటంతో మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- Download Application Form అనే ఆప్షన్ పై నొక్కి మీ దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ అప్లికేషన్ ఫారమ్ లో ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ అవసరపడుతుంది.