TS Assembly Elections 2023 : పొటీకి సై అంటున్న ప్రొఫెసర్... ఆసక్తికరంగా 'ఇల్లందు' రాజకీయాలు-professor gummadi anuradha to contest polls as an independent from yellandu assembly constituency 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : పొటీకి సై అంటున్న ప్రొఫెసర్... ఆసక్తికరంగా 'ఇల్లందు' రాజకీయాలు

TS Assembly Elections 2023 : పొటీకి సై అంటున్న ప్రొఫెసర్... ఆసక్తికరంగా 'ఇల్లందు' రాజకీయాలు

Mahendra Maheshwaram HT Telugu
Sep 03, 2023 05:45 AM IST

Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన ఇల్లందు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ సీటు నుంచి పోటీ చేయాలని చాలా మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఓ మహిళా ప్రొఫెసర్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

తండ్రి నర్సయ్యతో గుమ్మడి నర్సయ్య (ఫైల్ ఫొటో)
తండ్రి నర్సయ్యతో గుమ్మడి నర్సయ్య (ఫైల్ ఫొటో) (twitter)

Yellandu Assembly constituency: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను(115) ప్రకటించగా.. త్వరలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జాబితాలు రానున్నాయి. ఇదిలా ఉంటే... ఇతర పార్టీల నుంచి పోటీ చేయడమే కాకుండా, ఇండిపెండెంట్ గా కూడా బరిలో నిలిచే వాళ్లు ఏర్పాట్లు చేసుకునే పనిలో పడ్డారు. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల నగారా మోగబోతున్న నేపథ్యంలో.... పోటీ చేసే స్థానాలపై గురిపెట్టారు. అయితే రిజర్వుడు నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల స్వీకరించగా... ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇల్లందు సీటు కోసం ఏకంగా 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీల్లో కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇదిలా ఉంటే... ఇదే ఇల్లందు సీటు నుంచి బరిలో ఉండేందుకు ఓయూకు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె ఎంట్రీ ఖరారు కావటంతో... ఇల్లందు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

పోటీ సై అంటున్న గుమ్మడి అనురాధ...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని లా డిపార్ట్ మెంట్ ఫ్రొఫెసర్ గుమ్మడి అనురాధ ప్రకటించారు. ఈమె మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె. ఇటీవలే ఇల్లెందులో మీడియాతో మాట్లాడిన ఆమె.... పోటీ విషయంపై ఓ ప్రధాన పార్టీకి చెందిన నేతలు కలిశారని, పోటీ చేయాలని కోరారని తెలిపారు. అయితే తాను మాత్రం రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాని.... స్వతంత్రంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని కుట్రలు, కబ్జా రాజకీయాల బారినుంచి కాపాడేందుకు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించారు అనురాధ. ఇక ప్రస్తుతం గుమ్మడి అనురాధ ఉస్మానియా పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించిన తొలి ఆదివాసీ మహిళగా కూడా అనురాధకు గుర్తింపు దక్కింది.

అనురాధ తండ్రి గుమ్మడి నర్సయ్య... ఇయన అంటే తెలియని వారు ఉండరు. సీపీఐ ఎంఎల్‌ పార్టీ విప్లవ రాజకీయాల్లో రాష్ట్ర నాయకుడిగా, ఇల్లెందు నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1999, 2004లో 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎలాంటి ఆర్బాటాలకు తావులేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యనే గడిపారు నర్సయ్య. ఇప్పటికీ ఒక సామాన్య జీవితం గడుపుతున్నారు. ఇప్పటికీ ఆయన వ్యవసాయం మీదే ఆధాపడుతూ జీవనం గడుపుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రెండుసార్లు ఓడిపోయారు. అయినా పార్టీని అంటిపెట్టుకుని, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ప్రజలతోనే జీవిస్తున్నారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఏనాడు కూడా అవినీతిని దరిచేరనివ్వని గొప్ప నాయకుడిగా నర్సయ్య పేరు పొందారు. ఈ నేపథ్యంలో నర్సయ్య కుమార్తె కావటమే కాకుండా... ప్రొఫెసర్ గా పని చేస్తున్న అనురాధతో బీఆర్ఎస్ చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆమె టికెట్ ఇచ్చి... ఇల్లందు నుంచి బరిలో ఉంచాలని భావించింది. ఈ మేరకు ఆమెతో చర్చలు జరిపినప్పటికీ... అనురాధ స్వతంత్రంగానే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి కాంగ్రెస్ తరపున బానోతు హరి ప్రియా నాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆమె బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆమెకో మరోసారి టికెట్ కూడా ప్రకటించింది గులాబీ అధినాయకత్వం. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో... మాజీ ఎమ్మెల్యే నర్సయ్య కుమార్తె అయిన గుమ్మడి అనురాధ పోటీ ఇల్లందులో ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point