JNV Admissions: జవహార్ నవోదయలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల-notification issued for admissions in jawahar navodaya educational institutes ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jnv Admissions: జవహార్ నవోదయలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

JNV Admissions: జవహార్ నవోదయలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

HT Telugu Desk HT Telugu
Aug 28, 2023 10:56 AM IST

JNV Admissions: వచ్చే విద్యా సంవత్సరానికి జవహార్‌ నవోదయ విద్యా సంస్థల్లో ఆరో తరగతి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 649 జేఎన్‌వి విద్యాలయాల్లో ప్రవేశాల కోసం రెండు విడతలుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. 2024 మార్చి,ఏప్రిల్ నెలల్లో ఫలితాలు వెల్లడిస్తారు.

జవహార్ నవోదయలో ఆరోతరగతి అడ్మిషన్లు
జవహార్ నవోదయలో ఆరోతరగతి అడ్మిషన్లు

JNV Admissions: వచ్చే విద్యా సంవత్సరానికి) జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.

దేశ వ్యాప్తంగా 649 జేఎన్‌వీల్లో 6వ తరగతిలో ప్రవేశాలను రెండు విడతల్లో ఎంపిక పరీక్షJNVST 2024 నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. నవంబర్‌ 4వ తేదీ శనివారం ఉదయం 11.30గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 2024 జనవరి 20వ తేదీ శనివారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జేఎన్‌వీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఎన్‌వీలో ప్రవేశాల కోసం https://navodaya.gov.in/nvs/en/Home1వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఆరో తరగతిలో ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసిస్తూ ఉండాలి. విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

జేఎన్‌వీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2012 నుంచి జులై 31, 2014 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.

ప్రవేశ పరీక్ష నిర్వహణ ఇలా….

జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. మెంటల్‌ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్‌‌లలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2 గంటల వ్యవధిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో జవహార్ నవోదయ విద్యాలయాల అధికారిక వెబ్‌సైట్‌ https://navodaya.gov.in/nvs/en/Home1 ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ నిర్వహణ….

ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి/ఏప్రిల్‌లో విడుదల చేస్తారు. రాతపరీక్షలు నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 11.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు రెండు గంటల పాటు జరిగే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు.

పరీక్షల్లో మెంటల్‌ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. దాంతో పాటు అర్థమెటిక్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు; లాంగ్వేజ్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున ఇస్తారు. మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నాపత్రానికి గంట సమయం ఉండగా, మిగతా రెండింటికీ చెరో అర్దగంట పాటు సమయం ఇస్తారు.