Nirmal News : ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ- కుచడి శ్రీహరిరావు
Nirmal News : కర్ణాటకలో ఐదు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చామని, తెలంగాణలో 6 గ్యారెంటీలతు అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత శ్రీహరిరావు అన్నారు.
Nirmal News : తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరీ సభలో సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలనే రాష్ట్రంలో అధికారం చేపట్టనుందని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుచడి శ్రీహరిరావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్ గ్యారెంటీలను స్వాగతిస్తున్నారన్నారు. ఈ మేరకు ఆయన నిర్మల్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా సోనియా గాంధీ ఇచ్చిన ఆరు హామీలను అందిస్తామని తెలిపారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేసిందన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నమన్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన రెండు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా పెంచలేదని ఆరోపిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు వర్తించేలా గ్యారెంటీ ఇచ్చిందన్నారు. 6 గ్యారంటీలను ఒక కార్డుపై ముద్రించి ఇంటింటికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్డు ద్వారా మహిళలకు, విద్యార్థులకు, ఇండ్లు లేని పేదలకు, రైతులకు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికీ మేలు జరుగనుందని తెలిపారు.
రిపోర్టర్ : కామోజి వేణుగోపాల్, ఆదిలాబాద్