Son Killed Mother : తండ్రిపై దాడి.. అడ్డొచ్చిన తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు -mother murdered by son with ax in jogulamba gadwal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Son Killed Mother : తండ్రిపై దాడి.. అడ్డొచ్చిన తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

Son Killed Mother : తండ్రిపై దాడి.. అడ్డొచ్చిన తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

HT Telugu Desk HT Telugu
Apr 08, 2023 02:12 PM IST

Jogulamba Gadwal district News: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. క్షణికావేశంలో కన్నతల్లి అని గొడ్డలితో హత్య చేశాడు కన్న కొడుకు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గద్వాల జిల్లాలో దారుణం
గద్వాల జిల్లాలో దారుణం

Son Killed Mother in Gadwal district: భార్య, భర్త... వారికి ఏడు మంది సంతానం. ఇందులో నలుగురు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు. ప్రస్తుతం ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అయితే వీరిలో మూడు కుమారుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఈ మధ్యనే గ్రామానికి వచ్చిన అతను తండ్రిని డబ్బులు అడిగాడు. అతను నిరాకరించటంతో దాడికి దిగాడు. ఈ క్రమంలో తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా... ఆవేశంలో గొడ్డలితో కొట్టాడు. తీవ్రగాయాలతో తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.... ఈ ఘటన వడ్డేపల్లి మండలం రామాపురం లో జరిగింది. రాముడు, హరిజన నాగమ్మ (60) దంపతులు. వీరికి ఏడు మంది సంతానం ఉన్నారు. ఇందులో ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో మూడో కొడుకు అయినా ప్రేమ్ రాజ్ ది ప్రేమపెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ప్రేమ్ రాజ్... సొంత గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో తండ్రిని డబ్బులు అడిగాడు. తమ దగ్గర డబ్బులేదని తల్లితండ్రులు చెప్పటంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న ఓ చెట్టును కూడా నరికేశాడు. అడ్డుచెప్పబోయిన తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. గమనించిన తల్లి.. కొడుకుకు అడ్డు పడింది. దీంతో ప్రేమ్ రాజు కోపంతో ఊగిపోయాడు. తండ్రి మీద చేయాలనుకున్న దాడిని తల్లి మీద చేశాడు. చేతిలోని గొడ్డలితో అడ్డువచ్చిన తల్లిని గట్టిగా కొట్టాడు. ఫలితంగా తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. ప్రేమ్ రాజ్ పారిపోకుండా... పట్టుకొని చెట్టుకు కట్టేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తల్లి నాగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టు కోసం ఆస్పత్రికి తరలించారు. కుమారుడు చేసిన దారుణం చేసి తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు.

Whats_app_banner