Fire Accident: అబిడ్స్ అనధికారిక బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం, కాలి బూడిదైన వాహనాలు, భారీగా నష్టం
Fire Accident: హైదరాబాద్ అబిడ్స్‌లో అనధికారికంగా నిర్వహిస్తున్న బాణాసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి దుకాణంలో విక్రయాలు జరుగుతున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిసి పడి దుకాణం దగ్దమైంది. ఈ ఘటనలో సమీపంలో ఉన్న హోటల్ కూడా కాలి బూడిదైంది.
Fire Accident: హైదరాబాద్ అబిడ్స్ పరిధిలోని బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారాస్ బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. రాత్రి విక్రయాలు జరుగుతున్న సమయంలో ఘటన చోటు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో పదికి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. భారీ పేలుడు శబ్దాలతో మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లోని అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బాణసంచా దుకాణంలో చెలరేగిన మంగటలు పక్కనున్న హోటల్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో పదికి పైగా వాహనాలు దగ్ధం అయ్యాయి.
బాణసంచా దుకాణంలో నిప్పురవ్వలు అంటుకుని జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండున్నర గంటల పాటు పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సుల్తాన్ బజార్ బొగ్గుల కుంట హనుమాన్ టెక్లీలోని వ్యాపార సముదాయ ప్రాంగణంలో ఆదివారం జరి గిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదంలో పది వరకు ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్కు మంటలు వ్యాపించి కాలిపోవ డంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
బషీర్ బాగ్‌కు చెందిన చెందిన గుర్విందర్ సింగ్ హనుమాన్ టిక్టిలో పారస్ ఫైర్‌వర్క్స్ దుకాణం ఏర్పాటు చేశారు. ఆదివారం కావడంతో కొనుగోలుదారులు పెద్దఎత్తున వచ్చారు. అందరూ కొనుగో ళ్లలో ఉండగా ఒక్కసారిగా దుకాణంలోని పటాసులు ఒకదాని వెంట ఒకటి పేలాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారీ శబ్దాలు చేస్తూ క్షణాల్లో దుకాణంలోని టపాసులకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో ఆందోళనకు గురైన కొనుగోలుదారులు, స్థాని కులు పరుగులు పెట్టారు. మంటలు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్కు వ్యాపించడంతో లోపల సామగ్రి కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడింది. దుకా ణంలో పనిచేసే ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. పది వరకు ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఐదు అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.
బయటి నుంచి నిప్పు రవ్వలు వచ్చి దుకా ణంలో పడటంతో మంటలు అంటుకున్నట్లు దుకాణంలో పనిచేసే సిబ్బంది చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అబిడ్స్‌లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.