MLA Rekha Nayak : పర్యటన ఉందని తెలిసింది… కేటీఆర్‌ను ముఖాముఖిగానే ప్రశ్నిస్తా - ఎమ్మెల్యే రేఖా నాయక్-khanapur mla rekha nayak comments on ktr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Rekha Nayak : పర్యటన ఉందని తెలిసింది… కేటీఆర్‌ను ముఖాముఖిగానే ప్రశ్నిస్తా - ఎమ్మెల్యే రేఖా నాయక్

MLA Rekha Nayak : పర్యటన ఉందని తెలిసింది… కేటీఆర్‌ను ముఖాముఖిగానే ప్రశ్నిస్తా - ఎమ్మెల్యే రేఖా నాయక్

HT Telugu Desk HT Telugu
Sep 20, 2023 06:31 PM IST

MLA Rekha Nayak News: మంత్రి కేటీఆర్‌ను ముఖాముఖిగా ప్రశ్నిస్తానని చెప్పారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే రేఖానాయక్
ఎమ్మెల్యే రేఖానాయక్

MLA Rekha Nayak: ఉమ్మడి అదిలాబాదులోని  ఖానాపూర్ సెగ్మెంట్ లో ఎన్నికల వేడి రోజు రోజు కు వేడెక్కుతుంది, ఇక్కడ టికెట్ పొందిన జాన్షన్ నాయక్ వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖనాయక్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 25న కేటీఆర్ పర్యటన ఉన్నట్టు తెలుస్తుందని, తనకు జరిగిన అన్యాయంపై కేటీఆర్ ని నేరుగా ముఖాముఖీ ప్రశ్నిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రకటించారు. 

ఇటీవల టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన టికెట్ల జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల అసంతృప్తికి లోనై ఘాటుగా స్పందించారు. ఖానాపూర్ టికెట్ పొందిన వ్యక్తి జాన్సన్ నాయక్ కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమేనని చెప్పారు. కేటీఆర్ అండ చూసుకొని ఇష్టారీతిన  ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఆదిష్టానానికి అసత్య ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ తనకు సీటు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తాను గత పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రజలతో ప్రజలను తనవైపు లాక్కుంటున్నారని మండి పడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేశామని, తను ఇంకా తాను బీఆర్ ఎస్ ఎమ్మెల్యేనని, తన ఏసీడీపీ నిధులు ఆపేశారని, మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న తన అల్లుడిని ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు ఇచ్చే సెక్యూరిటీని స్థానిక పోలీసులు తొలగించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, తాను మారుమూల ప్రాంతంలో పర్యటిస్తున్నానని తనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని స్థానిక పోలీసులను ప్రశ్నించారు. ఒక అభ్యర్థిగా ఉన్న జాన్సన్ నాయకు వత్తాసు పలుకుతూ ఆయన వెంట పోలీసులు సెక్యూరిటీగా వెళ్లడం సిగ్గుచేటు అన్నారు

ఆరు నెలల ముందే ప్రణాళిక…

ఎస్టీ రిజర్వుడు స్థానంపై కన్నేసిన భూక్యా జాన్సన్ నాయక్, తనపై ఆరోపణలు చేస్తూ ఇక్కడికి వచ్చిన అభివృద్ధి నిధులను అడ్డుకునేలా చేశారని ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఫిర్యాదులు చేశాడని, స్నేహితుడైన కేటీఆర్ ను నమ్మించాడని అన్నారు. పథకం ప్రకారం ఖానాపూర్ లో కొన్ని ముఖ్యమైన అభివృద్ధి పనులను చేయలేదన్నట్లుగా చూపించి టికెట్ రాకుండా చేశారని మండిపడ్డారు. నిధులు ఇవ్వకుంటే తాను అభివృద్ధి ఎలా చేస్తానని… ఈనెల 25న నిర్మల్ కు రానున్న కేటీఆర్ తో నేరుగా ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. తను ప్రజా ఆశీస్సులతో గెలిచానని, తనకు ప్రజాబలం ఎక్కువ అని, కచ్చితంగా రెబల్ గా పోటీలో దిగి జాన్సన్ నాయక్ ఓడగొడతానన్నారు . ఒక మహిళ ఎమ్మెల్యేను బాధపెడుతున్నారని, తనకు వచ్చే నిధులను వెంటనే ఇవ్వకపోతే ఖానాపూర్ చౌరస్తాలో ధర్నా నిరాహార దీక్ష చేస్తానన్నారు. 

Whats_app_banner

సంబంధిత కథనం