Gajwel Mla KCR: గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్..-kcr took oath as gajwel mla in ts assembly speaker chamber ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gajwel Mla Kcr: గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్..

Gajwel Mla KCR: గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్..

Sarath chandra.B HT Telugu
Feb 01, 2024 01:49 PM IST

Gajwel Mla KCR: బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు.

శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తున్న కేసీఆర్‌
శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తున్న కేసీఆర్‌

Gajwel Mla KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఛాంర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్‌తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ‍ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక ముందే కాలు జారి పడటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

గురువారం మధ్యాహ్నం 12.30 సమయంలో కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు శాసనసభకు తరలి వచ్చారు. కాసేపు సహచరులు, పార్టీ నాయకులతో కలిసి వేచి ఉన్నారు. అనంతరం ముహుర్తం సమయానికి స్పీకర్ కార్యాలయంలో శాసన సభ్యుడిగా ప్రమాణం చేశారు.

అసెంబ్లీకి వచ్చిన సమయంలో కేసీఆర్‌ చేతి కర్ర సాయంతో మెల్లగా నడుచుకుంటూ వచ్చారు. ఆయన వెంట ఎంపీ సంతోష్ ఉన్నారు. స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు.

కేసీఆర్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. నవంబర్‌లో నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే.

డిసెంబర్‌ 7వ తేదీన ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో కాలు జారి పడి పోవడంతో తుంటికి గాయమైంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలోకి శస్త్ర చికిత్స తర్వాత కోలుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేశారు. బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్‌ను ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అంతకుముందు, కేసీఆర్‌ అసెంబ్లీ వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీకి కేసీఆర్‌ వస్తున్నారన్న వార్త నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ అభిమానులు భారీ సంఖ్యలో శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది.

sar

Whats_app_banner