BRS Party : బీఆర్ఎస్‌ గూటికి మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి-kantareddy tirupati reddy join the brs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Party : బీఆర్ఎస్‌ గూటికి మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి

BRS Party : బీఆర్ఎస్‌ గూటికి మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి

HT Telugu Desk HT Telugu
Oct 07, 2023 08:31 AM IST

TS Assembly Elections 2023: మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పుకున్నారు.

బీఆర్ఎస్ లో చేరిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి
బీఆర్ఎస్ లో చేరిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి

Kantareddy Tirupati Reddy Joins BRS: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలో అవకాశం దక్కని నేతలు… పక్కపార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నందికంటి శ్రీధర్…. గులాబీ గూటికి చేరగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా మాజీ జిల్లా ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లో జాయిన్ అయ్యారు.

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామా రావుని హైదరాబాద్ లో కంఠారెడ్డి శుక్రవారం రాత్రి కలిశారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితి గురించి మంత్రి చాలాసేపు మాట్లాడారు. తనకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడిగా కానీ లేదా మెదక్ ఎంపీ అభ్యర్థిగానైనా అవకాశం ఇవ్వాలని కంఠారెడ్డి కోరినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం, పార్టీ అభ్యర్థుల కోసం పని చేసిన అందరికీ తప్పకుండ మంచి అవకాశాలు కల్పిస్తుంది అని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కంఠారెడ్డితో పాటు మెదక్ జిల్లాకు చెందిన చాలా మంది కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో చేరోబోతున్నారని సమాచారం. కంఠారెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేయటంతో… మండల స్థాయిలో పని చేసిన నాయకులు కూడా కంఠారెడ్డితో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి కాంగ్రెస్ చేరటంతో… ఆయన కుమారుడు రోహిత్ కు మెదక్ సీటు ఖరారైంది. దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అయితే చాలా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న తనని కాదని… కొత్తగా వచ్చిన మైనంపల్లికి టికెట్ ఇవ్వటంపై కంఠారెడ్డి అంసతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే మంత్రి హరీశ్ ను కలిసిన కంఠారెడ్డి… కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవెందర్ రెడ్డి విజయం కోసం పని చేయాలని కంఠారెడ్డికి మంత్రులిద్దరూ సూచించారు.

రిపోర్టర్ : మెదక్ జిల్లా

Whats_app_banner