Janagama Suicides: క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి..ఎస్సై దంపతుల ఆత్మహత్య
Janagama Suicides: కుటుంబ కలహాలు రెండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. జనగామలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ తెల్లవారు జామున ఉరి వేసుకుని ఆత్మ చేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఎస్సైను నిందించడంతో మనస్తాపానికి గురై తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Janagama Suicides: జనగామలో ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. టౌన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ సతీమణి స్వరూప తెల్లవారుజామున బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాస్ పోలీసులకు సమాచారం వచ్చారు. ఘటనపై శ్రీనివాస్ తన కుమారుడికి, భార్య తరపు బంధువులకు సమాచారం ఇచ్చారు.
ఎస్సై కుమారుడు రవితేజ వివాహం కొద్ది రోజుల క్రితం జరిగింది. కుమారుడు వివాహం జరిగినప్పటి నుంచి భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పెళ్లైన తర్వాత వారి కుమారుడు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎస్సై భార్య స్వరూప చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాస్ ఈ విషయాన్ని ఉదయాన్ని పెద్ద కొడుకుకు సమాచారం ఇచ్చారు. తల్లిని నువ్వే చంపేశావని కొడుకు నిందించారు. స్వరూప కుటుంబ సభ్యులు కూడా శ్రీనివాస్ వేధింపులతోనే చనిపోయి ఉంటుందని నిందించారు.
ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. జనగామ ఏసీపీ నేతృత్వంలో విచారణ జరిపారు. ఏసీపీ ఆధ్వర్యంలో వివరాలు సేకరిస్తున్న సమయంలో తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన శ్రీనివాస్ సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని చనిపోయారు. ఒకే సమయంలో భార్యా భర్తలు చనిపోవడం అందరిని కలిచి వేసింది. ఎస్సై భార్య ఏ కారణాలతో ఆత్మహత్య చేసుకుందనే వివరాలు ఆరా తీస్తుండగా బెడ్‌రూమయ్‌లోకి వెళ్లిన ఎస్సై శ్రీనివాస్ తుపాకీతో కాల్చుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనతో పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు.
ఎస్సై దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుందని బంధువులు కన్నీరుమున్నీయ్యారు. తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో వారి పిల్లల్ని తీవ్ర విషాదంలో నింపింది.