IRCTC Tirumala Tour: హైదరాబాద్ నుంచి తిరుమల, తిరుచానూరు ట్రిప్.. రూ.4 వేల ధరలో కొత్త ప్యాకేజీ - వివరాలివే-irctc tourism tirumala tour package from hyderabad check details inside ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tirumala Tour: హైదరాబాద్ నుంచి తిరుమల, తిరుచానూరు ట్రిప్.. రూ.4 వేల ధరలో కొత్త ప్యాకేజీ - వివరాలివే

IRCTC Tirumala Tour: హైదరాబాద్ నుంచి తిరుమల, తిరుచానూరు ట్రిప్.. రూ.4 వేల ధరలో కొత్త ప్యాకేజీ - వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 06, 2023 07:39 PM IST

IRCTC Hyderabad Tirumala Tour : తిరుమలతో పాటు పలు అధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. వివరాలు ఇక్కడ చూడండి….

హైదరాబాద్ - తిరుమల టూర్
హైదరాబాద్ - తిరుమల టూర్ (irctctourism.com)

RCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. 'GOVINDAM' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ అక్టోబరు 23, 2023వ తేదీన అందుబాటులో ఉంది.

ఈ టూర్ హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్, నల్గొండ స్టేషన్లల్లో కూడా స్టాప్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కాలనుకునేవారు ఎక్కొచ్చు.

Day 1 : లింగంపల్లి(Lingampally) నుండి సాయంత్రం 05:25 గంటలకు రైలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 2 : తిరుపతి(Tirupati)కి ఉదయం 05:55 గంటలకు చేరుకుంటారు. పికప్ చేసుకుని.. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత... ఉదయం 8 గంటల సమయంలో శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది. అనంతరం హోటల్ కు చేరుకొని లంచ్ చేస్తారు. ఆ తర్వాత తిరుచానూరు ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం 06. 25 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 3: ఉదయం 03:04 గంటలకు నల్గొండ, 05:35 సికింద్రాబాద్ స్టేషన్, 06:55 నిమిషాలకు లింగంపల్లి స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరల రేట్లు…

ఈ గోవిందం టూర్ ప్యాకేజీలో వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 4940, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 3800, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.3800గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులో చూస్తే... సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 6790ఉంది. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే వారికి వేర్వురు ధరలు నిర్ణయించారు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు పూర్తిగా వివరాలను తెలుసుకోవచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం