IRCTC Shirdi Tour Package : తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి తాజా టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!-irctc tourism operate sai shivam tour package from hyderabad city latest prices and updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Shirdi Tour Package : తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి తాజా టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

IRCTC Shirdi Tour Package : తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి తాజా టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

Maheshwaram Mahendra Chary HT Telugu
May 22, 2024 11:43 AM IST

IRCTC Hyderabad Shirdi Tour 2024: హైదరాబాద్ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. 4 రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి……

హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ (image source from unshplash)

IRCTC Hyderabad Shirdi Tour Package 2024: తక్కువ ధరలోనే  ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉంటున్నాయి. టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే అనేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా  షిర్డీకి  ‘సాయి శివమ్’ (SAI SHIVAM) పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో నాసిక్ కూడా చూసి రావొచ్చు.  హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో ఈ ప్యాకేజీ ఉంటుంది. మే 31, 2024న ప్యాకేజీ అందుబాటులో ఉంది.

సాయి శివమ్ టూర్ ప్యాకేజీ షెడ్యూల్ 2024:

  • షిర్డీ , నాసిక్ చూసేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి శివమ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
  • హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 
  • ప్రస్తుతం మే 31, 2024న ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా వెళ్లొచ్చు.
  • ఫస్ట్ డే - హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్(రైలు నెం. 17064 అజంతా ఎక్స్‌ప్రెస్) ఉంటుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.
  • సెకండ్ డే : ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలోని పలు ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.
  • మూడో రోజు : షిరిడీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • నాల్గొ రోజు : ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
  • ఈ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 9320గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7960,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7940గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లోఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.  (మార్చి , ఏప్రిల్ నెలలతో పోల్చితే రూ. 200 వరకు ధరలు తగ్గాయి.)
  • స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 7635గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 6270ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6250ఉంది. (స్టాండర్డ్ క్లాస్ లో గడిచిన రెండు మూడు నెలల ధరలతో పోల్చితే ఇక్కడ కూడా రూ. 150- 200 వరకు తగ్గాయి)
  • ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. 
  • https://www.irctctourism.com/ క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. 
  • 9701360701 / 8287932229 / 9281495843 ఈ మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.

 

Whats_app_banner