IRCTC Kashmir Tour : భూతలస్వర్గం 'కశ్మీర్' లో 6 రోజులు - బడ్జెట్ ధరలోనే ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
IRCTC Hyderabad Kashmir Tour 2024: ఈ మండే వేసవిలో భూతలస్వర్గమైన కశ్మీర్ కు వెళ్లే ఆలోచన ఉందా..? అయితే హైదరాబాద్ నుంచి మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఆరు రోజులపాటు టూర్ ఉంటుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
Hyderabad - Kashmir Tour 2024: కశ్మీర్(Kashmir)…. భూతలస్వర్గంగా పేరు గాంచింది. ఇక్కడి అందాలను చూసి… ఫిదా అవ్వాల్సిందే. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలను ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తాయి. ఇందుకు ఏ ఒక్కరూ… అతీతం కాదు. అలాంటి కశ్మీర్(Kashmir) ను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే మరీ..! అందులోనూ మండే వేసవిలో వెళ్తే…కూల్ కూల్ గా సేద తీరే అవకాశం ఉంటుంది. అయితే అక్కడికి వెెళ్లటం ఖర్చుతో కూడిన పని అని చాలా మంది భావిస్తుంటారు. కానీ బడ్జెట్ ధరలోనే అనేక రకాల ప్యాకేజీలను తీసుకువస్తోంది ఐఆర్ సీటీసీ టూరిజం(IRCTC Tourism). ఇందులో భాగంగా… కశ్మీర్ అందాలను వీక్షించేందుకు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.
"MYSTICAL KASHMIR EX HYDERABAD' పేరుతో హైదరాబాద్ నుంచి కశ్మీర్ వెళ్లేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది IRCTC. ప్రస్తుతం ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులోకి వస్తుంది. కేవలం ఈ ఒక్క డేట్ మాత్రమే కాకుండా… 15.04.2024, 19.04.2024, 24.04.2024 ,15.05.2024, 24.05.2024, 30.05.2024, 14.06.2024 మరియు 19.06.2024 తేదీలు కూడా అందుబాటులో ఉన్నాయి. 6 రోజులు సాగే ఈ ట్రిప్ లో….. శ్రీనగర్, గుల్మార్గ్, Pahalgamతో పాటు Sonmarg ఇందులో కవర్ అవుతాయి.
కశ్మీర్ టూర్ షెడ్యూల్ :
డే 1 - Hyderabad to Srinagar - హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు ఫ్లైట్ జర్నీ ద్వారా స్టార్ట్ అవుతారు. సాయంత్రం సమయానికి శ్రీనగర్ కు చేరుకుంటారు.
డే 2 -Srinagar-Sonmarg- Srinagar - సోన్ మార్గ్ వెళ్తారు. పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు.
డే 3 -Srinagar-Gulmarg-Srinagar - గుల్మార్ ను సందర్శిస్తారు. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ బ్రిడ్జిని చూస్తారు. రాత్రి శ్రీనగర్ లోనే ఉంటారు.
డే 4 - Srinagar- Pahalgam -Srinagar -పహల్మాగ్ కు వెళ్తారు. Saffron ఫీల్డ్స్ ను సందర్శిస్తారు. పహల్మాగ్ చిత్ర పరిశ్రమల షూటింగ్ కు అత్యంత ఫేమస్. ఇక్కడి నేచర్ అత్యంత అద్భుతంగా ఉంటుంది.
డే 5 - Pahalgam -Srinagar - శ్రీనగర్ కు చేరుకుంటారు. ఇక్కడ మొఘల్, బోటానికల్ గార్డెన్స్ ను చూస్తారు. Shankracharya Templeను దర్శించుకుంటారు. రాత్రికి హౌస్ బోట్ లో బస చేస్తారు.
డే 6 - Srinagar -ఆరో రోజు శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
కశ్మీర్ ట్రిప్ టికెట్ ధరలు
ధరలు చూస్తే కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి 58,565గా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 51,300గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 52930గా ఉంది. చిన్న పిల్లలకు వేర్వురు ధరలను నిర్ణయించారు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటే IRCTC టూరిజం జోనల్ ఆఫీస్ 040-27702407 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.,