Hyd IPL traffic Diversions: ఐపిఎల్‌ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మూడు గంటల ముందే స్టేడియంలోకి ఎంట్రీ..-ipl match traffic restrictions in hyderabad today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ipl Match.. Traffic Restrictions In Hyderabad Today..

Hyd IPL traffic Diversions: ఐపిఎల్‌ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. మూడు గంటల ముందే స్టేడియంలోకి ఎంట్రీ..

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 09:16 AM IST

Hyd IPL traffic Diversions: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఉప్పల్ స్టేడియంలో గురువారం ఐపీఎల్‌ మ్యాచ్‌లలో భాగంగా సన్ రైజర్స్‌- ముంబై ఇండియన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుండటంతో స్టేడియం పరిసరాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల్ని వివరిస్తున్న సీపీ తరుణ్ జోషి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల్ని వివరిస్తున్న సీపీ తరుణ్ జోషి

Hyd IPL traffic Diversions: ఐపీఎల్  IPL మ్యాచ్‌ నేపథ్యంలో ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్‌ స్టేడియంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ Rachakonda  సీపీ తరుణ్‌ జోషి తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు పోలీసులు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు Restrictions అమలు చేస్తున్నట్టు సీపీ తరుణ్ జోషి ప్రకటించారు.  Uppal PS ఉప్పల్ ట్రాఫిక్ పిఎస్‌ లిమిట్స్‌ పరిధిలో ఉన్న ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం ఏడున్నర నుంచి ఐపీఎల్ 2024 మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు ప్రకటించారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ట్రాఫిక్‌ డీసీపీ మనోహర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ చక్రపాణిలతో కలిసి ట్రాఫిక్ ఆంక్షల్ని వివరించారు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఉప్పల్‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గురువారం ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ నేపథ్యంలో అన్ని రకాల భారీ వాహనాలను అనుమతించరు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11.50 వరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

భారీ వాహనాల మళ్లింపు…

చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను టయోటా షో రూమ్‌ - హెచ్‌ఎండిఏ భాగ్యత్ రోడ్డులోకి మళ్లిస్తారు. ఈ వాహనాలు హెచ్‌ఎండిఏ భాగ్యత్-నాగోల్ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.

ఎల్‌బినగర్‌-నాగోల్‌-ఉప్పల్ మీదుగా వెళ్లే భారీ వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ దిగువున మలుపు తీసుకుని హెచ్‌ఎండిఏ లే ఔట్, బోడుప్పల్, చెంగిచర్ల క్రాస్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.

తార్నాక నుంచి వచ్చే వాహనాలు హబ్సిగూడ క్రాస్ రోడ్డు నుంచి నాచారం, చర్లపల్లి ఐఓసీఎల్‌ వైపు వెళ్లాలని సూచించారు.

3 గంటల ముందే స్టేడియంకు రావచ్చు..

క్రికెట్ మ్యాచ్‌ నేపథ్యంలో మ్యాచ్‌ ప్రారంభమయ్యే మూడు గంటల ముందే ప్రాంగణానికి రావొచ్చని పోలీసులు తెలిపారు. మ్యాచ్‌ నేపథ్యంలో 2,800కు పైగా వివిధ విభాగాల పోలీస్‌ బలగాలు మొహరించినట్టు చెప్పారు. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలతో బందోబస్తును ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుండగా 3 గంటల ముందే ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతిస్తామని చెప్పారు.

క్రికెట్‌ మ్యాచ్‌ చూడ్డానికి వచ్చే వారు Stadium స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దని సీపీ స్పష్టం చేశారు. సిగరెట్‌, లైటర్‌, బ్యానర్స్‌, ల్యాప్‌ ట్యాప్‌లు, బ్యాటరీలు, ఫర్‌ఫ్యూమ్స్‌, హెల్మెట్లు, బైనాక్యూలర్లు, అగ్గిపెట్టెలు, పాన్‌ మసాలాలు, కెమెరాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, పెన్నులు, వాటర్‌ బాటిళ్లు, బయటి తినే పదార్ధాలు స్టేడియంలోకి అనుమతించరని ప్రకటించారు. కారు పాస్‌ ఉన్నవారంతా రామంతాపూర్‌ వైపు నుంచి స్టేడియంకు రావాలని సూచించారు. దివ్యాంగులు గేట్‌-3 ద్వారా లోపలకు వెళ్లాల్సి ఉంటుంది.

ఐపీఎల్ మ్యాచ్‌ నేపథ్యంలో ప్రయాణానికి వీలుగా మెట్రోలో అదనపు ట్రిప్పులతో పాటు ఉప్పల్ స్టేడియంకు అదనపు సర్వీసుల్ని నడుపనున్నారు. వ్యక్తిగత వాహనాలకంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ సేవల్ని వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో Sunrisers Hyderabad సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్‌ Mumbai Indians మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ టిక్కెట్లు లభ్యం కాకపోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆన్‌లైన్‌ పెట్టిన గంటల వ్యవధిలోనే టిక్కెట్ల విక్రయం పూర్తి కావడంతో ఉసూరుమంటున్నారు.

IPL_Entry_Point