Post Jobs | ఇండియా పోస్ట్ నుంచి గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇటీవలే వివిధ రాష్ట్రాల్లోని ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియా పోస్ట్.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి.
ఇండియా పోస్ట్ మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా 650 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 34 పోస్టులున్నాయి. రెండేళ్ల కాలానికి ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఆ తర్వాత గడువు పొడిగించే అవకాశం ఉంది.
ఇప్పటికే నోటిఫికేషన్ ప్రారంభమైంది. ఈ మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు వివరాలను తెలిపింది. దరఖాస్తు చేసుకునేందుకు.. 2022 మే 20 చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు IPPB అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. అదే నెలలో ఫలితాలు కూడా వస్తాయి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. గ్రామీణ డాక్ సేవక్‌గా రెండేళ్ల అనుభవం కూడా ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అప్లై చేసేందుకు దరఖాస్తు ఫీజును.. ఫీజు రూ.700గా నిర్ణయించారు.
రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. సమయం 90 నిమిషాలుగా నిర్ణయించారు. నెగిటివ్ మార్కులు ఉండవు. కనీసం 40 మార్కులు వచ్చినవారు క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై అయినవారికి అవసరాన్ని బట్టి లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ చేస్తారు.
పరీక్షా కేంద్రాలు ఏపీలోని.. అనంతపూర్, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసరికి.. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఉన్నాయి. వేతనం నెలకు రూ.30,000గా ఉంటుంది.
దరఖాస్తు 2022 మే 10న ప్రారంభమైంది. చివరి తేదీ 2022 మే 20గా ఉంది. అడ్మిట్ కార్డుల 2022 మే 27న విడుదల చేస్తారు. 2022 జూన్ లో పరీక్ష ఉంటుంది. ఫలితాల 2022 జూన్ న విడుదల చేస్తుంది.
రాష్ట్రాల వారీగా ఖాళీలు..
ఆంధ్రప్రదేశ్ 34, తెలంగాణ 21, అస్సాం 25, బీహార్ 76, చత్తీస్‌గఢ్ 20, ఢిల్లీ 4, గుజరాత్ 31, హర్యానా 12, హిమాచల్ ప్రదేశ్ 9, జమ్మూ అండ్ కాశ్మీర్ 5, జార్ఖండ్ 8, కర్ణాటక 42, కేరళ 7, మధ్యప్రదేశ్ 32, మహారాష్ట్ర 71, ఒడిశా 20, పంజాబ్ 18, రాజస్తాన్ 35, తమిళనాడు 45, ఉత్తరప్రదేశ్ 84, ఉత్తరాఖండ్ 3, పశ్చిమ బెంగాల్ 33, ఈశాన్య రాష్ట్రాలు 15
ఇప్పటికే ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ చేయనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2,942 పోస్టులున్నాయి.