TSPSC Polytechnic Lecturer Jobs : టీఎస్పీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలు, జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల-hyderabad tspsc released govt polytechnic colleges lecturers general ranking list ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Polytechnic Lecturer Jobs : టీఎస్పీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలు, జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల

TSPSC Polytechnic Lecturer Jobs : టీఎస్పీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలు, జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Apr 20, 2024 05:42 PM IST

TSPSC Polytechnic Lecturer Jobs : తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల పోస్టుల ర్యాంకింగ్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ ను ప్రకటిస్తామని తెలిపింది.

పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలు
పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలు

TSPSC Polytechnic Lecturer Jobs : ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల పోస్టు(TSPSC Polytechnic Lecturers) భర్తీకి టీఎస్పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించింది. ఈ రాత పరీక్ష ర్యాకింగ్ జాబితాను టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది. అభ్యర్థుల ర్యాంకింగ్ జాబితాను సబ్జెక్టుల వారీగా కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ల పోస్టుల భ‌ర్తీకి గత ఏడాది టీఎస్పీఎస్సీ(TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 స‌బ్జెక్టుల్లో లెక్చరర్ల ఉద్యోగాల‌ను(Lecturer Jobs) భ‌ర్తీ చేయనున్నారు.

త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితా

టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు(TSPSC Polytechnic Lecturers Recruitment ) టీఎస్పీఎస్సీ గత ఏడాది సెప్టెంబర్ 4 నుంచి 6 , 8వ తేదీన రాత పరీక్ష నిర్వహించింది. ఈ రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల సాధారణ ర్యాంకింగ్ జాబితాను(Polytechnic Lecturers Rankings) టీఎస్పీఎస్సీ https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది. సాధారణ ర్యాంకింగ్ జాబితా ప్రకారం మెరిట్ జాబితాను తయారుచేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్(Short List) చేసిన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ర్యాంకింగ్ జాబితాలో రిజెక్ట్ చేసిన వారిని జనరల్ ర్యాంకింగ్ జాబితాలో చేర్చలేదని పేర్కొంది.

టీఎస్పీఎస్సీ గ్రూప్‌-2 రివైజ్డ్‌ పోస్టులు ప్రకటన

టీఎస్పీఎస్సీ గ్రూప్‌-2 (TSPSC Group 2)రివైజ్ట్‌ పోస్టుల వివరాలను ప్రకటిచింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్‌లను అమలు చేస్తున్న కారణంగా గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాలను రివైజ్డ్‌ బ్రేకప్‌ కింద ప్రకటించింది. ఈ రివైజ్డ్‌ ఖాళీల బ్రేకప్‌లో మహిళల రోస్టర్‌ పాయింట్‌ తొలగించింది. అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా ప్రకటించింది. ఈ సవరణ బ్రేకప్‌ వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్‌ కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

నేటితో ముగియనున్న టీఎస్ టెట్ అప్లికేషన్ల గడువు

తెలంగాణ టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు(Telangana TET 2024 Applications) ఇవాళ్టి(ఏప్రిల్ 20)తో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఏవరైనా ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 10వ తేదీనే ముగియాల్సి ఉంది. కానీ పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఈ తేదీని ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఫలితంగా ఇవాళ్టితో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. https://schooledu.telangana.gov.in లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్ణయించిన ఫీజును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం