Hyderabad Revenge Killing : హైదరాబాద్(Hyderabad crime) లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాత కక్షలతో ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు వెంటాడి హత్య చేశారు. హత్య అనంతరం ఇన్ స్టా గ్రామ్ వీడియో(Instagram Video) పెట్టారు. హత్య చేశామని ఇన్ స్టాలో రీల్స్ చేశారు. హైదరాబాద్ బాచుపల్లి పీఏస్ పరిధిలో సిద్ధూ అనే యువకుడిని ఇద్దరు యువకులు వెంటాడి 12 సార్లు కత్తులతో పొడిచి, తలపై బండరాళ్లతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం బైక్‌పై వెళుతూ.. రక్తంతో ఉన్న కత్తులు, చేతులను చూయిస్తూ ఇన్‌స్టా లో రీల్స్(Murders Post Instagram Reels) చేశారు. గత ఏడాది తరుణ్ రాయ్ అనే యువకుడి హత్య కేసులో సిద్ధూ నిందితుడిగా ఉన్నాడు. దీంతో కక్ష కట్టి ప్రతీకారంగా సిద్ధూని తరుణ్ రాయ్ స్నేహితులు హత్య చేశారు.
హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ గత ఏడాది జరిగిన తరుణ్ రాయ్ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో జైలుకెళ్లిన సిద్ధూ ఇటీవలె విడుదలయ్యాడు. ప్రస్తుతం ప్రగతినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని తల్లితో కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సిద్ధూ తల్లి ఊరు వెళ్లడంతో... స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు సిద్ధూ. సోమవారం తెల్లవారుజామున 3.30 సమయంలో సిద్ధూ(Pragathi nagar Murder) ఇంటికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు తలుపులు కొట్టారు. బయటకు వచ్చిన సిద్ధూని ముగ్గురు యువకులు కత్తులతో పొడిచి, తలపై బండ రాయితో మోదీ హత్య చేశారు. దీంతో సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందాడు. సిద్ధూని మర్డర్ చేశామని యువకులు ఇన్ స్టా గ్రామ్ లో వీడియో పెట్టారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ వీడియో ప్రజల్ని భయాందోళనకు గురయ్యేలా చేస్తుంది. నేరాలకు పాల్పడి దర్జాగా వీడియోలు తీసి పెడుతున్న యువత విపరీత ధోరణి పోలీసులు, చట్టాలంటే భయం లేకుండా పోయిందని నెటిజన్లు అంటున్నారు.
సిద్ధూ హత్య(Revenge Killing)జరిగిన ఘటనా స్థలిని కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ పరిశీలించారు. ఈ హత్యకు పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తరుణ్ రాయ్ హత్యకు ప్రతీకారంగా తమ పగ నెరవేర్చుకున్నామని నిందితులు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు.
సంబంధిత కథనం