Hyderabad Murder: మలుపు తిరిగిన హైదరాబాద్ ఆదిభట్ల హత్య కేసు… మృతుడు మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్న-hyderabad adibhatla murder case that took a turn the deceased is former naxalite tirupati balanna ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Murder: మలుపు తిరిగిన హైదరాబాద్ ఆదిభట్ల హత్య కేసు… మృతుడు మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్న

Hyderabad Murder: మలుపు తిరిగిన హైదరాబాద్ ఆదిభట్ల హత్య కేసు… మృతుడు మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్న

Sarath chandra.B HT Telugu
Apr 08, 2024 01:33 PM IST

Hyderabad Murder: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన తండ్రిని చంపిన కొడుకు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మృతుడు రవిందర్‌‌ను మాజీ మావోయిస్టుగా గుర్తించారు. అతనిపై 35 హత్య కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

మాజీ నక్సలైట్‌ బాలన్నను హత్య చేసిన తనయుడు అనురాగ్
మాజీ నక్సలైట్‌ బాలన్నను హత్య చేసిన తనయుడు అనురాగ్

Hyderabad Murder: హైదరాబాద్‌ శివార్లలోని ఆదిభట్లలో జరిగిన హత్య కేసు కీలక మలుపు తిరిగింది. తనయుడు చేతిలో ప్రాణాలు కోల్పోయిన రవిందర్‌ను మాజీ నక్సలైట్‌గా తిరుపాటి బాలన్నగా గుర్తించారు. నయీం అనుచరుడైన తిరుపతి బాలన్న Tirupati balanna కుమారుడు అనురాగ్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. హత్యకు అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడిపై 35 హత్య కేసులు ఉన్నాయి.

హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. ఏప్రిల్ 5వ తేదీన నడిరోడ్డుపై తండ్రిని కుమారుడు హతమార్చాడు. మాదకద్రవ్యాల Drug Addiction వినియోగానికి అలవాటు పడిన తనయుడు ఏకంగా తండ్రినే హతమార్చాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చిన్న వయసులోనే గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసగా మారిన తనయుడు చివరకు కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేవారు.

పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పంటించి ఆపై తలపై రాయితో మోదీ హత్య చేశాడు. హైదరాబాద్‌ శివార్లలోని ఆదిభట్ల Adibhatla పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కయంజాల్‌ ప్రాంతంలో గత గురువారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు, బాధితులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన తిరుపాటి రవిందర్‌ ravinder నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో చాలా కాలం క్రితం స్థిరపడ్డాడు. నగరంలో స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్నాడు.రవిందర్‌ మొదటి భార్య చనిపోవడంతో సుధ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు విచారణలో తిరుపాటి రవిందర్‌ అసలు పేరు బాలన్నగా గుర్తించారు. మృతుడు మావోయిస్టు పార్టీలో పనిచేసి తర్వాత కాలంలో నయీం అనుచరుడిగా కొనసాగినట్టు దర్యాప్తు వెల్లడైంది.

రవిందర్‌ అలియస్‌ బాలన్న మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.వారిలో పెద్ద కొడుకు చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. చిన్నకొడుకు విదేశాల్లో స్థిరపడ్డాడు. రవిందర్‌ ప్రస్తుతం రెండో భార్య సుధతో కలిసి ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానకంగా రవిందర్‌గా చలామణీ అవుతున్నబాలన్నపై 35కు పైగా హత్య కేసులు నమోదయ్యాయి. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత అజ్ఞాతంలో ఉన్నాడు. నయీం ఆస్తుల వివరాలన్నీ బాలన్నకు తెలుసనే ప్రచారం జరుగుతోంది.

రెండు నెలల క్రితం తుర్కయంజాల్‌లోని ఆరెంజ్‌ అవెన్యూ కాలనీలో కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లోకి బాలన్న కుటుంబం షిఫ్ట్ అయ్యింది. రవీందర్‌ సుధ దంపతులకు అనురాగ్‌ Anurag, అభిషేక్‌ సంతానం ఉన్నారు. పెద్దకొడుకు అనురాగ్‌ ఖాళీగా ఉంటున్నందుకు మందలిచడంతో తండ్రిపై కక్ష పెంచుకున్నాడని తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది.

డ్రగ్ ఎడిక్షన్ మాన్పించడానికి రీహాబిలిటేషన్‌ కేంద్రంలో చేర్పించి చికిత్స చేయించినా మార్పురాలేదని తల్లి తెలిపింది. ఇప్పటికే అతనిపై రెండు పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో జైలు శిక్ష అనుభవించాడని సమాచారం అందించారు. రవిందర్‌ గత జీవితం తాలుకా వివరాలను గోప్యంగా ఉంచారు. పోలీసుల విచారణలో రవిందర్‌ మాజీ నక్సలైట్‌గా గుర్తించారు. దీంతో హత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రిని హత్య చేసేందుకు పథకం ప్రకారం పెట్రోల్ తీసుకు వచ్చి గొడవపెట్టుకుని దాడికి పాల్పడ్డాడు. గత గురువారం మధ్యాహ్నం తల్లి పడకగదిలో ఉండగా బయట నుంచి తాళం పెట్టిన అనురాగ్‌.. తండ్రి రవిందర్‌తో గొడవకు దిగాడు. ఇంట్లో దాచి ఉంచిన పెట్రోలును తండ్రిపై పోసేందుకు ప్రయత్నించడంతో తప్పించుకున్న తండ్రి.. భయంతో రోడ్డు మీదకు పరుగులు పెట్టాడు.

ఇంటికి కొద్ది దూరంలోనే పట్టుకుని ఒంటిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత మంటల్లో కాలిపోతున్న రవిందర్‌ను బండరాయితో తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తండ్రి నుంచి ప్రాణాపాయం ఉంటుందనే భయంతోనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలన్న నేర చరిత్ర తెలిసి ఉండటంతో పాటు ఇతర కారణాలు ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు రవిందర్ భార్య సుధ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటు పడటంతో తరచూ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతున్నట్లు తొలుత భావించారు. ఈ కేసులో అంతకు మించిన కారణాలు ఉంటాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆస్తి వ్యవహారాల్లో హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నెలరోజుల క్రితమే మృతుడు కోటిరుపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు.

Whats_app_banner

సంబంధిత కథనం