Singotam Ramu Murder Case : యువతితో ఫోన్ చేయించి, ఇంటికి రప్పించి...! రియల్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..-accuseds arrested in bjp leader singotam ramu murder case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singotam Ramu Murder Case : యువతితో ఫోన్ చేయించి, ఇంటికి రప్పించి...! రియల్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..

Singotam Ramu Murder Case : యువతితో ఫోన్ చేయించి, ఇంటికి రప్పించి...! రియల్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు..

HT Telugu Desk HT Telugu
Feb 10, 2024 08:49 AM IST

Yousufguda Singotam Ramu Murder Case Updates: యూసఫ్ గూడలో జరిగిన బీజేపీ నేత సింగోటం రాము హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. రెండేళ్ల క్రితమే హత్యకు ప్లాన్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులోని నిందితులను అరెస్ట్ చేశారు.

హత్యకు గురైన సింగోటం రాము(ఫైల్ ఫొటో)
హత్యకు గురైన సింగోటం రాము(ఫైల్ ఫొటో) (Facebook Singotam Ramu )

Singotam Ramu Murder Case Updates: ఇటీవలే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీజేపీ నేత, రియల్టర్ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.వాటికి సంబంధించిన వివరాలను జూబ్లిహిల్స్ ఏసిపి హరి ప్రసాద్,ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి ,ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తో కలిసి వెల్లడించారు.వారు తెలిపిన వివరాల ప్రకారం.... నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రాము (36) నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. రాము జీడిమెట్ల లోని రామిరెడ్డి నగర్ కు చెందిన ఇందువుల మణికంఠ అలియాస్ మని (30) అనే డ్రైవర్ తో కలిసి గత రెండేళ్లుగా మూడు ముక్కలట ఆడుతున్నాడు. జూదంలో రాము బాగా సంపాదించాడు.

yearly horoscope entry point

పథకం ప్రకారమే హత్య.....

దీంతో రాము పై మణికంఠ ఈర్ష్య పెంచుకున్నాడు.ఇదే విషయంలో పలు మార్లు రాము,మనిల మధ్య గొడవ జరగడంతో పోలీస్ స్టేషన్ లలో పరస్పరం ఫిర్యాదులు సైతం చేసుకున్నారు.ఒకసారి ఆగ్రహంతో మణికంఠ పై రాము దాడి చేసి హత్యాయత్నం చేశాడు.ఇదంతా మనసులో పెట్టుకున్న మణికంఠ తనపై దాడి చేసిన రాముని ఎలాగైనా అంతం చేయాలని పథకం పన్నాడు.అందుకోసం రెండేళ్ళ క్రితమే కత్తులను కూడా కొనుగోలు చేసి సమయం కోసం వేచి చూశాడు.ఈ నేపథ్యంలోనే యూసఫ్ గూడ లో ఉండే పఠాన్ సనీమ (19),ఆమె తల్లి హిమామ్ బి(35) అలియాస్ అసీనా తో కలిసి రాముని హత మార్చేందుకు పథకం పన్నాడు.

ఈ క్రమంలోనే తమ ఇంటికి రావాలని సనిమా,అసినా రాముని ఆహ్వానించింది.ఇదే విషయాన్ని మణికంఠ కు మెసేజ్ చేసి తెలియచేసింది.దీంతో మణికంఠ తన స్నేహితులు దరావత్ వినోద్ కుమార్,మొహమ్మద్ కైసర్,కావాలి శివ కుమార్,కుప్పం నిఖిల్, మరియు తున్నం కుమార్ తో కలిసి సనిమా ఇంటికి చేరుకోగా.… అప్పటికే తల్లి కూతుళ్ళు రాముని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.అనంతరం ప్రధాన నిందితుడైన మణికంఠ రాము కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రాముని హత్య చేసినట్లు సమాచారం ఇచ్చి అక్కడి నుండి పరారయ్యారు.దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రధాన నిందుతడు మణికంఠ తో పాటు అతని ఐదుగురు స్నేహితులు, సనిమ, ఆసీనా ను అదుపులోకి తీసుకున్నారు.కాగా మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో మణికంఠ పై రౌడి షీట్ నమోదై ఉన్నట్లు వారు గుర్తించారు.వారి నుంచి ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు

జిహెచ్ఎంసి తాత్కాలిక ఉద్యోగి ఆత్మహత్య.....

ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని జిహెచ్ఎంసి తాత్కాలిక ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసులు తెలిపే వివరాల ప్రకారం......వెంకటగిరి ప్రాంతంలో నివాసం ఉండే నీరుడు యాదమ్మ (56) జిహెచ్ఎంసిలో తాత్కాలిక ఉద్యోగినిగా పనిచేస్తుంది. ఆమె భర్త పదేళ్ళ క్రితం చనిపోగా ఆమె పెద్ద కుమారుడు నరేందర్ కూడా గత ఏడాది మృతి మృత్యువాత పడ్డాడు.చిన్న కుమారుడు హోటల్లో పని చేస్తున్నాడు.భర్త,పెద్ద కుమారుడు చనిపోయిన దగ్గర నుంచి యాదమ్మ మానసికంగా కృంగిపోయింది. ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒంటరి జీవితాన్ని భరించలేక,ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనస్థాపం చెంది యాదమ్మ శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం