TTDP : తెలంగాణ వైపు చూడని టీడీపీ- ఈసారి తెలుగు తమ్ముళ్ల మద్దతు ఎవరికి?-hyderabad news in telugu tdp not clarity on lok sabha election contest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ttdp : తెలంగాణ వైపు చూడని టీడీపీ- ఈసారి తెలుగు తమ్ముళ్ల మద్దతు ఎవరికి?

TTDP : తెలంగాణ వైపు చూడని టీడీపీ- ఈసారి తెలుగు తమ్ముళ్ల మద్దతు ఎవరికి?

HT Telugu Desk HT Telugu
Mar 11, 2024 10:27 PM IST

TTDP : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు పొత్తులతో ఏకమవుతున్నాయి. అయితే టీడీపీ, జనసేన తెలంగాణలో లోక్ సభ ఎన్నికలపై ఊసే ఎత్తడంలేదు. టీటీడీపీ, జనసేన ఈసారి తెలంగాణ పోటీ చేస్తాయా? లేదో? ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

తెలంగాణ వైపు చూడని టీడీపీ
తెలంగాణ వైపు చూడని టీడీపీ

TTDP : త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు(TS Politics) రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ఎత్తులపై ఎత్తులు వేస్తూ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుందా లేదా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు బీజేపీ ఇటు జనసేన పార్టీలతో కలిసి పోటీ చేస్తుండగా...... తెలంగాణలో మాత్రం టీడీపీ పోటీ విషయంపై మాత్రం ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ టైం దగ్గర పడుతుండడంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంటన్న దానిపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

yearly horoscope entry point

తెలుగు తమ్ములు చూపు ఎటువైపు?

రాష్ట్రంలో టీడీపీ(TDP) ఉనికి పెద్దగా లేకపోయినప్పటికీ....కొన్ని చోట్ల పార్టీకి చెప్పుకోదగిన కేడర్, సానుభూతిపరులు ఉన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక, మొన్నటి శాసనసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. కాగా టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కొన్ని చోట్ల ఏకంగా టీడీపీ జెండా పట్టుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం సైతం చేశారు. అయితే తెలుగు తమ్ములు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ఉన్నారని టాక్ వినిపించింది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఈసారి కూడా తెలుగు తమ్ములు హస్తం పార్టీకే మద్దతు ఇస్తారా? లేక ఏపీలో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ వైపు నిలుస్తారా? అనేది ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ (TS Politics)లో ఆసక్తిగా మారింది.

రాష్ట్ర అధ్యక్షుడే కరువు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) అయ్యారు. దీంతో ఆ పార్టీ కీలక నేత సినీనటుడు బాలకృష్ణ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్(NTR Bhavan) లో తెలంగాణ నేతలతో కలిసి భేటీ అయి పోటీ గురించి చర్చించారు. అనంతరం తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని చంద్రబాబు తేల్చి చెప్పడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి(TTDP) రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి తెలంగాణ శాఖకు కనీసం అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఏపీలో ఈసారి అధికారం తమదే అన్న ధీమాతో ఉన్న టీడీపీ తెలంగాణ రాజకీయాలను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తుంది.

ఊసే లేని జనసేన

మరోవైపు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections)బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన(Janasena) పార్టీ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది స్థానాల్లో పోటీ చేయగా......ఎక్కడా కూడా కనీసం చెప్పుకో దగిన ఓట్లు కూడా ఆ పార్టీ రాబట్టుకొలేక పోయింది. దీంతో అప్రమత్తమైన బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి ఎవరితోనూ పొత్తు ఉండదని సింగిల్ గానే పోటీలో ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ రాజకీయాలను పెద్దగా పట్టించుకోవడం లేనట్టే తెలుస్తుంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం