BJP TDP Janasena Alliance : బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది- సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటన- కనకమేడల
BJP TDP Janasena Alliance : ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరిందని టీడీపీ నేతల కనకమేడల ప్రకటించారు. సీట్ల సర్దుబాటుపై త్వరలో సమావేశాలు జరుగుతాయన్నారు.
BJP TDP Janasena Alliance : ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలో(BJP TDP Janasena Alliance) మధ్య పొత్తు కుదిరిందని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ప్రకటించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మూడు పార్టీలు కలిసి వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో(AP Elections) పోటీ చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటన ఉంటుందన్నారు. ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి(NDA) అవసరాన్ని రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు. మూడు పార్టీల బలాబలాలను బట్టి సీట్ల సర్దుబాటు ఉంటుందన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే మూడు పార్టీలో లక్ష్యం అన్నారు.
రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పొత్తు
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ నేత కనకమేడల అన్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) శనివారం మరోసారి భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు 50 నిమిషాలపాటు ముగ్గురు నేతలు చర్చించారు. ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ సమావేశ వివరాలను టీడీపీ నేత కనకమేడల మీడియాకు వివరించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన (TDP BJP Janasena Alliance)కలిసి పనిచేయాలని నిర్ణయించాయని కనకమేడల తెలిపారు.
సీట్ల సర్దుబాటు ఇలా?
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అయితే పొత్తుల్లో భాగంగా ఇప్పటికే టీడీపీ, జనసేన పోటీపై ప్రకటించాయి. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుందని పవన్ ప్రకటించారు. అయితే లోక్ సభ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. బీజేపీ ఎక్కువ సీట్లు అడగడంతో చర్చలు సుధీర్ఘంగా కొనసాగుతున్నాయి. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. మిగిలిన 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే 25 లోక్ సభ స్థానాల్లో 8 సీట్లను బీజేపీ, జనసేనలకు కేటాయించేందుక టీడీపీ ప్రాథమికంగా అంగీకరించిందని తెలుస్తోంది. 8 సీట్లలో బీజేపీ 6 స్థానాల్లో, 2 చోట్ల జనసేన బరిలో దిగే అవకాశం ఉంది. 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, 6 చోట్ల బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ లోక్ సభ సీట్లపై మాత్రమే దృష్టి సారించిందని సమాచారం. ఈ సీట్ల సర్దుబాటుపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
అనకాపల్లి నుంచి సీఎం రమేష్ , రాజమండ్రి నుంచి పురందేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, అరకు లేదా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ కుమార్ రెడ్డి లోక్ సభకు పోటీ చేయనున్నారు. హిందూపురం, తిరుపతిలో ఏదొక స్థానం నుంచి బీజేపీ(BJP) అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ, మచిలీపట్నంలలో జనసేన పోటీ చేయనుంది. ఆరు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారని సమాచారం.
సంబంధిత కథనం