T Congress MP Candidates List 2024 : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల - 4 స్థానాలకు పేర్లు ఖరారు-congress names 4 candidates in first list to contest in telangana in upcoming loksabha polls 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  T Congress Mp Candidates List 2024 : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల - 4 స్థానాలకు పేర్లు ఖరారు

T Congress MP Candidates List 2024 : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల - 4 స్థానాలకు పేర్లు ఖరారు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 08, 2024 07:42 PM IST

Telangana Congress MP Candidates First List 2024 : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు పేర్లు ఖరారయ్యాయి.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

Telangana Congress MP Candidates List 2024 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. మొత్తం 39 మంది అభ్యర్థులకు ఇందులో చోటు కల్పించారు. వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేయనున్నారు.

ఈ జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను(Telangana Congress MP Candidates 2024) ఖరారు చేసింది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి(Janareddy Family) పేరును ఫైనల్ చేసింది. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్ కు అవకాశం దక్కింది. ఇక మహబూబాబాద్(ఎస్టీ రిజర్వ్) లోక్ సభ నియోజకవర్గం నుంచి బలరామ్ నాయక్ పేరు ఖరారైంది. మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డికి అవకాశం దక్కింది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు:

సురేశ్ షెట్కర్ - జహీరాబాద్

వంశీచందర్ రెడ్డి - మహబూబ్ నగర్

రఘువీర్ రెడ్డి - నల్గొండ

బలరామ్ నాయక్ - మహబూబాబాద్.

ఇక ఇటీవలే మహబూబ్ నగర్ లో తలపెట్టిన సభా వేదికపై మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రకటన చేశారు. అయితే తాజాగా ఏఐసీసీ విడుదల చేసిన తొలి జాబితాలో నే వంశీచందర్ రెడ్డి పేరు ఉంది. దీంతో ఆయన మహబూబ్ నగర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

ఇక తొలి జాబితాను పరిశీలిస్తే… కీలకమైన నల్గొండ పార్లమెంట్ స్థానం కోసం పార్టీకి చెందిన సీనియర్ నేత దామోదర్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఇక ఆయనే కాకుండా…. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేశ్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ సీటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆయనకు హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఓ దశలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటానికి సిద్ధపడిన పటేల్ రమేశ్ రెడ్డి(Patel Rameshreddy)… చర్చల అనంతరం వెనక్కి తగ్గారు. ఈసారి నల్గొండ పార్లమెంట్ స్థానం తప్పకుండా వస్తుందని భావించారు. కానీ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి అవకాశం ఉంది పార్టీ అధినాయకత్వం. ఇంకా అంతా ఊహించినట్లు జహీరాబాద్ సీటు సురేశ్ షెట్కర్ కు, మహబూబాబాద్ సీటు బలరామ్ నాయక్ కు దక్కింది.

తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా… ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. త్వరలోనే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, రాజ్ నంద్ గావ్ నుంచి ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, తిరువనంతపురం నుంచి శశిథరూర్ వంటి ప్రముఖ నేతలు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే, బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.