తెలుగు న్యూస్ / ఫోటో /
Uppal Skywalk : ఉప్పల్ స్కైవాక్ వంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- Uppal Skywalk : హైదరాబాద్ ఉప్పల్ కూడలిలో హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ రూ.36.5 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించింది. 660 మీటర్ల మేర స్కైవాక్ ఏర్పాటు చేశారు.
- Uppal Skywalk : హైదరాబాద్ ఉప్పల్ కూడలిలో హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ రూ.36.5 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించింది. 660 మీటర్ల మేర స్కైవాక్ ఏర్పాటు చేశారు.
(2 / 9)
హైదరాబాద్‌లో రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటేందుకు హెచ్ఎండీఏ స్కైవాక్ టవర్ నిర్మించింది. ఈ స్కైవాక్ టవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
(4 / 9)
665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, 6 మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ స్కైవాక్‌ను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యం కల్పించారు.
(5 / 9)
నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీస్ సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి.
(6 / 9)
నాలుగు వైపుల నుంచి ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు స్కైవాక్ వంతెనను అనుసంధానించారు. మెట్లు ఎక్కలేని వారికోసం ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం కూడా కలదు.
(7 / 9)
స్కైవాక్ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంటుంది.
(8 / 9)
స్కైవాక్ లో ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు రూఫ్‌లను ఏర్పాటుచేశారు.
ఇతర గ్యాలరీలు