TS Inter Academic Calendar 2024-25 : ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల, 75 రోజులు సెలవులు-hyderabad intermediate junior college academic calendar 2024 25 released 227 working days 75 holidays ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Academic Calendar 2024-25 : ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల, 75 రోజులు సెలవులు

TS Inter Academic Calendar 2024-25 : ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల, 75 రోజులు సెలవులు

Bandaru Satyaprasad HT Telugu
Mar 30, 2024 10:37 PM IST

TS Inter Academic Calendar 2024-25 : తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యాసంవత్సరానికి తాత్కాలిక అకాడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. మొత్తం 227 రోజుల పనిదినాలు, 75 సెలవులతో షెడ్యూల్ ప్రకటించింది.

 ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల
ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల

TS Inter Academic Calendar 2024-25 : తెలంగాణ ఇంటర్ బోర్డు తాత్కాలికంగా అకాడమిక్ క్యాలెండర్(TS Inter Academic Calender 2025) ను ప్రకటించింది. ఇంటర్ మొదటి, ద్వితీయ విద్యార్థులకు 2024-25 విద్యాసంవత్సరం అకాడమిక్ షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలను జూన్ 1, 2024న రీఓపెన్ చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ ఏడాది దసరా సెలవులను(Dasara Holidays 2024) కూడా ప్రకటించింది. ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 14, 2024న కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటనలో తెలిపింది.

yearly horoscope entry point

హాఫ్ ఇయర్లీ పరీక్షలు

ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు(Inter Half Yearly Exams) నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 16 వరకు ప్రకటించారు. సంక్రాంతి(Sankranti 2025) అనంతరం జనవరి 17, 2025న ఇంటర్ కాలేజీలు రీఓపెన్ చేస్తారు. 2025 జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాది ఇంటర్ పరీక్షలు(IPE 2024-25 )

  • ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు - ఫిబ్రవరి మెదటి వారం, 2025
  • ఇంటర్ వార్షిక పరీక్షలు - మార్చి మొదటి వారం, 2025
  • 2024-25 అకాడమిక్ క్యాలెండర్ చివరి పనిదినం- మార్చి 29, 2025
  • వేసవి సెలవులు- మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు
  • అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు - మే చివరి వారం, 2025
  • 2025-26 విద్యాసంవత్సంలో ఇంటర్ కాలేజీల రీఓపెన్ -జూన్ 2, 2025

2024-25 విద్యాసంత్సరంలో- సెలవులు- పనిదినాలు

2024-25 విద్యా సంవత్సరంసెలవులుపనిదినాలు
జూన్,2024723
జులై, 2024724
ఆగస్టు, 2024724
సెప్టెంబర్, 2024822
అక్టోబర్, 20241219
నవంబర్, 2024624
డిసెంబర్, 2024823
జనవరి, 2025922
ఫిబ్రవరి, 2025523
మార్చి, 2025623
మొత్తం75227

కనీసం 220 రోజులు పనిదినాలు

48వ ఇంటర్ బోర్డు మీటింగ్ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో కనీసం 220 రోజుల పాటు ఇంటర్ కాలేజీలు (Inter Colleges Working Days)పనిచేయనున్నాయి. 75 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీ డేస్(Summer Holidays) అని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ బోర్డు విడుదల చేసే అడ్మిషన్ షెడ్యూల్(Inter admissions 2024) ప్రకారమే అడ్మిషన్లు తీసుకోవాలని అధికారులు ప్రకటనలో తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం