TS Inter Summer Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ - మే 31 వరకు తెలంగాణ ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు-summer holidays for telangana inter colleges from 31st march 2024 check the full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Summer Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ - మే 31 వరకు తెలంగాణ ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు

TS Inter Summer Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ - మే 31 వరకు తెలంగాణ ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 28, 2024 06:05 PM IST

TS Inter Summer Holidays 2024: తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రకటించింది ఇంటర్ బోర్డు. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని పేర్కొంది.

ఇంటర్ కాలేజీలకు సమ్మర్ సెలవులు
ఇంటర్ కాలేజీలకు సమ్మర్ సెలవులు

TS Inter Summer Holidays 2024 : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) పూర్తి కావటంతో ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి 30వ తేదీని 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి లాస్ట్ వర్కింగ్ డేగా పేర్కొంది. మార్చి 31వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు(TS Inter Summer Holidays 202) ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. మే 31వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయని ప్రకటించింది. జూన్ ఒకటో తేదీన కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక పరీక్షలు... ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమన సంగతి తెలిసిందే. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9 లక్షల మందిపైగా స్టూడెంట్స్ పరీక్షలు రాశారు. ఇందులో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు.

ఈ ఏడాది జరిగిన పరీక్షలకు సంబంధించి….. జవాబు పత్రాల మూల్యాంకనం నడుస్తోంది. ఈ నెఖారులోపు వాల్యూయేషన్ పూర్తి కానుంది. జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గత అనుభవాల దృష్ట్యా.... ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే... మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే…?

Telangana Intermediate Exam Results 2024: ఇక ఈసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పరీక్షల నిర్వహణ, ఫలితాలను ప్రకటించే యోచనలో విద్యాశాఖ ఉంది. ఈ క్రమంలో...ఈసారి ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తి చేసి... ఫలితాలను కూడా త్వరగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో రావొచ్చని అంచనా…! గత ఏడాది చూస్తే మే 9వ తేదీన ఫలితాలను(TS Inter Results 2024) వెల్లడించింది ఇంటర్ బోర్డు. ఆ షెడ్యూల్ ను చూస్తే పరీక్షలు పూర్తి అయిన 30 రోజుల గడువు తర్వాత రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చాయి.

గత ఏడాదితో పోల్చితే.. ఈసారి సాధ్యమైనంత త్వరగా ఫలితాల విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.... వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే నెల మూడో వారం లేదా చివరి వారంలో పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలకు సంబంధించి తుది ప్రకటన ఇంటర్ బోర్డు పేర్కొననుంది. ఇక తెలంగాణలో ఎంసెట్(TS EAMCET 2024) ప్రవేశ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభమై… 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.