CM Revanth Reddy : పదేళ్లుగా తెలంగాణ తల్లి గుర్తురాలేదా? రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి చూద్దాం- సీఎం రేవంత్ రెడ్డి ఫైర్-hyderabad cm revanth reddy fires on ktr rajiv gandhi statue remove comments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : పదేళ్లుగా తెలంగాణ తల్లి గుర్తురాలేదా? రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి చూద్దాం- సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

CM Revanth Reddy : పదేళ్లుగా తెలంగాణ తల్లి గుర్తురాలేదా? రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి చూద్దాం- సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Bandaru Satyaprasad HT Telugu
Aug 20, 2024 02:13 PM IST

CM Revanth Reddy : డిసెంబర్ 9లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదన్నారు.

 పదేళ్లుగా తెలంగాణ తల్లి గుర్తురాలేదా? రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి చూద్దాం- సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
పదేళ్లుగా తెలంగాణ తల్లి గుర్తురాలేదా? రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి చూద్దాం- సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

CM Revanth Reddy : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇన్‌ఛార్జ్ మున్షీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థలు బలోపేతం అయ్యింది రాజీవ్ గాంధీ హయాంలోనే అన్నారు.

బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా, ఆ పార్టీ నేతలకు బ‌లుపు త‌గ్గలేదన్నారు. మీ బలుపు తీసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాచమర్యాదలతో సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరు మారుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

టచ్ చేసి చూడండి సీఎం సవాల్

"పొద్దున లేస్తే ఫాంహౌజ్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం పెట్టాల్నా? రాజీవ్ విగ్రహంపై చెయ్యి పెట్టండి... చెప్పు తెగుద్ది" అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని విమర్శించారు. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందన్నారు.

డిసెంబర్‌ 9 లోపు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తామన్నారు. ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండి చూద్దామని సవాల్ విసిరారు. రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే చెప్పు తెగే దాకా కొడుతామన్నారు. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదని ఘాటుగా స్పందించారు. తొందరలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామన్నారు. రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామంటున్నారని, వారి బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారన్నారు.

పదేళ్లుగా తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు?

తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహాలు సచివాలయం ముందు పెట్టాల్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కేసీఆర్ విగ్రహాన్ని పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు అధికారం ఇక కలనే, మీరు చింతమడకకే పరిమితం అవుతారన్నారు.

పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విచక్షణ కోల్పోయి మాట్లాడితే తెలంగాణ సమాజం సామాజిక బహిష్కరణ చేస్తుందన్నారు. పది ఏళ్లుగా తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా? ఇప్పుడు రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామన్నారు.

సంబంధిత కథనం