BRS Merge: కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ ఖాయం: బండి సంజయ్-bandi sanjay sensational comments about kcr family and brs party merger ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Merge: కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ ఖాయం: బండి సంజయ్

BRS Merge: కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ ఖాయం: బండి సంజయ్

Basani Shiva Kumar HT Telugu
Aug 16, 2024 05:58 PM IST

BRS Merge: బీఆర్ఎస్ విలీనం.. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారింది. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని బీజేపీ అంటుంటే.. బీజేపీలో విలీనం చేస్తారని సీఎం రేవంత్ జోస్యం చెబుతున్నారు.

Bandi Sanjay
Bandi Sanjay (HT_PRINT)

బీఆర్ఎస్ గురించి కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు ఏఐసీసీ పదవీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బండి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

గవర్నర్‌గా కేసీఆర్..

బీజేపీ కీ లీడర్ కామెంట్స్ అలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి మరోలా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని.. దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. కేసీఆర్ గవర్నర్‌గా, కేటీఆర్‌ కేంద్రమంత్రిగా, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ ఈ కామెంట్స్ చేసిన కాసేపటికే.. బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు.

కేటీఆర్ క్లారిటీ..

అటు పార్టీ విలీనంపై.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రెండు దశాబ్దాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. అయినా పార్టీని సమర్థవంతంగా నడిపామని స్పష్టం చేశారు. మరో 50 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీని తామే నడిపిస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ తెలంగాణలో ఉండకూడదని కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

‘మేము నిజంగానే మా పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటే.. మా ఇంటి ఆడబిడ్డ కవిత 150 రోజులుగా ఎందుకు జైల్లో ఉంటుంది’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీలు తమపై బురద జల్లుతున్నాయని ఫైర్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని.. అప్పుడు తమ పార్టీ ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.