Husband killed Wife: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త-husband beat his wife to death in drunkenness in malkajgiri jawahar nagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Husband Killed Wife: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

Husband killed Wife: మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

HT Telugu Desk HT Telugu
Oct 10, 2023 11:08 AM IST

Husband killed Wife: మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య పై మద్యం మత్తులో కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పయింది.

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

Husband killed Wife: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్ నగర్‌లోని అంబేడ్కర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సద్దుల యాదగిరి, సద్దుల రేణుక 20 ఏళ్ల క్రిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య పై అనుమానం పెంచుకున్న యాదగిరి తరచూ ఆమెతో గొడవ పడుతూ ఉండడంతో పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు.

yearly horoscope entry point

సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన యాదగిరి భార్య తో గొడవ పెట్టుకొని ఆపై ఆమె తలపై కర్రతో దాడి చేశాడు. మద్యం మత్తులో ఏం జరిగిందో తెలియని యాదగిరి అక్కడే నిద్రపోయాడు. తెల్లవారుజామున లేచే సరికి భార్య విగత జీవిగా మారడంతో పిల్లలకు సమాచారం అందించాడు.

వారు వచ్చి ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటీకే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎస్ఆర్ నాగర్ లో మహిళపై అత్యాచారం..

హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో మహిళపై పలు మార్లు అత్యాచారం, గర్భవతిని చేసి మోసం చేసిన వ్యక్తిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఎ.చిన్నబాబు (28) హైదరబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎస్ ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న 26 ఏళ్ల యువతితో చిన్నబాబు పరిచయం పెంచుకుని ఆ తరువాత ప్రేమ,పెళ్లి పేరుతో ఆమెను బలవంతంగా పలుమార్లు లోబర్చుకున్నాడు.

ఆ మహిళ ఇటీవలే గర్భం దాల్చడంతో చిన్న బాబును నిలదీసింది. అప్పటి నుండి చిన్న బాబు మొహం చాటుతూ,పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తున్నాడు. మోస పోయానని గ్రహించిన సదరు మహిళ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. చిన్న బాబు పై అత్యాచారం,చీటింగ్ కేసులు నమోదు చేసిన అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం...నిందితుడికి జీవిత ఖైదు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో వ్యవసాయ కార్మికుడిగా పని చేస్తున్న పి.పాండు (30) అనే వ్యక్తి 2018 లో ఓ మైనర్ బాలిక పై అత్యాచారం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోమని కోరడంతో, పాండు ఆమెను మోసం చెయ్యడం ప్రారంభించాడు. అనంతరం బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలు తనను పాండు ప్రేమ పెళ్లి పేరుతో గర్భవతిని మోసం చేశాడని రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు నిందితుడు పాండు కు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.32000 వేల జరిమానా విధించింది.

రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner