Hyd Schools Holiday: జిహెచ్‌ఎంసి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పాఠశాలలకు నేడు సెలవు-holidays for schools in ghmc and rangareddy districts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Schools Holiday: జిహెచ్‌ఎంసి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పాఠశాలలకు నేడు సెలవు

Hyd Schools Holiday: జిహెచ్‌ఎంసి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పాఠశాలలకు నేడు సెలవు

Sarath chandra.B HT Telugu
Aug 20, 2024 09:16 AM IST

Hyd Schools Holiday: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి కుండపోత వానలతో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు నేడు సెలవులు ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డిలో పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డిలో పాఠశాలలకు సెలవులు

Hyd Schools Holiday: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి కుండపోత వానలతో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో పాఠశాలలకు నేడు సెలవులు ప్రకటించారు.

భారీ వర్షాలకు హైదరాబాద్‌ తడిచి ముద్దవుతోంది. సోమవారం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు తటాకల్లా మారాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అరగంటలో 5సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది.

మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లపైకి నీరు చేరింది. చాలా ప్రాంతాల్లో మోకాలి లోతున నీరు నిలిచిపోయింది. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావొద్దని జిహెచ్‌ఎంసి అధికారులు సూచించారు. వర్షపు నీటిని తొలగించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్‌ టీమ్‌లు శ్రమిస్తున్నాయి. నాలాలు ఆక్రమణలకు గురి కావడంతో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కావడంతో వర్షపు నీటి ప్రవాహానికి వీల్లేకుండా పోయింది. దీంతో డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో పాఠశాలలకు నేడు సెలవులు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని డిఈఓ ఆదేశించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రిన్సిపల్ నిర్ణయం తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొట్టుకు వచ్చిన శవం..

వరదలకు సికింద్రాబాద్‌ పార్సిగుట్ట నుంచి రామ్‌నగర్‌వైపుకు ఓ యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుడిని రామ్‌నగర్‌కు చెందిన అనిల్‌గా గుర్తించారు. సోమవారం ప్రమాదవశాత్తు వర్షపు నీటిలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. నగరంలోని షేక్‌పేట, ఇందిరా నగర్‌, యూసఫ్ గూడ ప్రాంతాల్లో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు జలమయం అయ్యాయి.

రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనాలు రోడ్లపై బంపర్‌ టూ బంపర్‌ నడిచాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించరు.

సోమవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. మంగళవారం ఉదయం కూడా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బి నగర్‌ నుంచి మియాపూర్‌ వరకు అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఎల్లో అలర్ట్…

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 040-2111 1111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించారు. జూబ్లిహిల్స్‌, బంజారా హిల్స్, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, అమీర్ పేట, పెద్ద అంబర్పేట్, మలక్‌పేట్, ఖైరతాబాద్‌, నాగారాం ,కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, అల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం