Telangana Election Schedule live Updates:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల-five states assembly elections schedule by eci live news updates 11october 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Election Schedule Live Updates:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం

Telangana Election Schedule live Updates:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

03:58 PM ISTOct 09, 2023 11:42 AM Sarath chandra.B
  • Share on Facebook
03:58 PM IST

  • Telangana Election Schedule live Updates:తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మరికాసేపట్లో మోగనుంది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.

Mon, 09 Oct 202307:32 AM IST

మిజోరాం తొలి పోలింగ్…

మిజోరాంలో నవంబర్‌ 7న ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 13న నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్‌ 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21వరకు పరిశీలిస్తారు. 23వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. పోలింగ్‌ నవంబర్‌ 7న నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్‌ 3న జరుగుతంది. మిజోరాంలో 8.52లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు.

Mon, 09 Oct 202307:31 AM IST

రాజస్థాన్‌లో నవంబర్‌ 23న ఎన్నికలు

రాజస్థాన్‌లో నవంబర్‌ 23న ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 30న నోటిఫికేషన్ వెలువడనుంది.నవంబర్‌ 6 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 7వరకు పరిశీలిస్తారు. 9వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. పోలింగ్‌ నవంబర్‌ 23న నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్‌ 3న జరుగుతంది. డిసెంబర్ 5లోగా ఎన్నికలు ముగిస్తారు. రాజస్థాన్‌లో 5.25కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

Mon, 09 Oct 202307:31 AM IST

మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఎన్నికలు

మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 21న నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్‌ 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31వరకు పరిశీలిస్తారు. నవంబర్‌ 2వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. పోలింగ్‌ నవంబర్‌ 17న నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్‌ 3న జరుగుతంది. మధ్యప్రదేశ్‌లో 5.6కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

Mon, 09 Oct 202307:30 AM IST

రెండు విడతల్లో చత్తీస్‌గడ్‌ పోలింగ్

చత్తీస్‌గడ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్‌ 7,17తేదీల్లో పోలింగ్‌ జరుగుతుంది. మొదటి దశలో 20 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండో దశలో 70 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్ 3న నిర్వహిస్తారు. చత్తీస్‌ ఘడ్‌లో 2.03కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

Mon, 09 Oct 202303:58 PM IST

నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చివరగా తెలంగాణ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో నవంబర్‌ 30న ఎన్నికలు జరుగనున్నాయి.నవంబర్‌ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్‌ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13 వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. పోలింగ్‌ నవంబర్‌ 30న నిర్వహిస్తారు. కౌంటింగ్ డిసెంబర్‌ 3న జరుగుతంది. డిసెంబర్ 5లోగా ఎన్నికలు ముగిస్తారు.

Mon, 09 Oct 202307:03 AM IST

నవంబర్‌ 13న తెలంగాణ ఎన్నికలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13న జరుగనున్నాయి.

Mon, 09 Oct 202306:58 AM IST

దేశ వ్యాప్తంగా 940 చెక్‌పోస్టులు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 940 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ చెప్పారు. మిజోరాం, రాజస్థాన్‌లలో అంతర్జాతీయ బోర్డర్లు ఉండటంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా పెంచుతున్నట్లు చెప్పారు.

Mon, 09 Oct 202306:51 AM IST

ఎన్నికల వ్యయంపై నిరంతర నిఘా

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యయంపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు.

Mon, 09 Oct 202306:51 AM IST

అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు రెడీ

అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు సిద్ధం అయ్యాయని స్పష్టం చేశారు. రోల్‌ టూ పోల్‌కు సర్వసన్నద్ధం అయినట్టు చెప్పారు.అన్ని రాష్ట్రాల్లో 100శాతం ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తైనట్టు చెప్పారు.జనవరి 1నాటికి 18ఏళ్లు నిండిన ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చిందని వివరించారు.

Mon, 09 Oct 202306:39 AM IST

679 నియోజక వర్గాల్లో ఎన్నికలు

ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగునున్నట్టు చెప్పారు.దేశంలోని మొత్తం ఓటర్లు ఐదు రాష్ట్రాల్లో ఆరో వంతు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 8.2 పురుష ఓటర్లు, 7.8మహిళలు ఉన్నారన్నారు. మొదటి సారి ఓటు వేసే వారు 60.2లక్షల మంది ఉన్నారని చెప్పారు. 17.34 వికలాంగ ఓటర్లు ఐదు రాష్ట్రాల్లో ఉన్నారని, 24.70లక్షల మంది 80 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారని చెప్పారు. వారికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు.

Mon, 09 Oct 202306:36 AM IST

ఎన్నికల నిర్వహణపై సన్నద్ధం

ఎన్నికల ప్రక్రియలో భాగమైన అన్ని ప్రభుత్వ విభాగాలతో ఇప్పటికే సన్నద్ధం చేసినట్లు ఛీప్ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇప్పటికే రాజకీయ పార్టీలతో చర్చలు జరిపినట్టు చెప్పారు. గత ఆర్నెల్లుగా ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.

Mon, 09 Oct 202306:34 AM IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. మిజోరాం, చత్తీస్‌గడ్‌, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను రాజీవ్ కుమార్‌ ప్రకటించారు.

Mon, 09 Oct 202306:12 AM IST

గడువుకు ముందే కొత్త ప్రభుత్వం

తెలంగాణలో అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 వరకు ఉంది. 2018 ఎన్నికలను చూస్తే… అక్టోబర్‌ 6వ తేదీన ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. సరిగ్గా రెండు నెలలకు అంటే డిసెంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహించింది. గెలిచిన వారితో జనవరి 17న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రకారం చూస్తే…. వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ వరకు ప్రస్తుత అసెంబ్లీ మనుగడలో ఉండనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

Mon, 09 Oct 202306:11 AM IST

మధ్యప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూల్

మధ్యప్రదేశ్​లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. 116 మ్యాజిక్​ ఫిగర్​. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 114 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్​. బీజేపీకి 109 స్థానాలే దక్కాయి. బీజేపీ కంటే ముందే పావులు కదిపి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవలేదు. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో.. కొన్నేళ్లకే కుప్పకూలింది. జ్యోతిరాదిత్య సింధియా.. బీజేపీకి మద్దతు పలికారు. ఆ తర్వాత.. శివరాజ్​ సింగ్​ చౌహాన్​ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Mon, 09 Oct 202306:11 AM IST

చత్తీస్‌ ఘడ్‌లో రెండు దశల్లో ఎన్నికలు

ఛత్తీస్​గఢ్​లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాల్లో గెలవాలి. 2018లో 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి 15 సీట్లు మాత్రమే దక్కాయి. సిఎం భూపేష్​ భగేల్​ నేతృత్వంలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్​ను ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది.

Mon, 09 Oct 202306:00 AM IST

తెలంగాణలో ఎన్నికలు

2014 నుంచి తెలంగాణలో బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. మెజారిటీ సాధించాలంటే 60 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ 88 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్​కు 19 సీట్లు దక్కాయి. బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది.

Mon, 09 Oct 202305:48 AM IST

డిసెంబర్‌లో పోలింగ్

ఐదు రాష్ట్రాల్లో నవంబర్​ రెండో వారం నుంచి- డిసెంబర్​ మొదటి వారం వరకు పోలింగ్​ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్ని దశల్లో పోలింగ్​ జరుగుతుందనే దానిపై నేడు స్పష్టత రానుంది. తెలంగాణలో ఒకే దశలోనే పోలింగ్​ ప్రక్రియ ముగిసే అవకాశాలు ఉన్నాయి. 2018లో ఒకే రోజు ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్​గఢ్​లో రెండు దశల్లో పోలింగ్​ జరగొచ్చు. మిగిలిన రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికలు ముగిసే అవకాశం ఉంది.

Mon, 09 Oct 202305:48 AM IST

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు

తెలంగాణతో పాటు ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ గడువు త్వరలో ముగియనుంది. గడువుకు ముందే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాల్సి ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్​ రానుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మరింత పెరుగుతుంది.

Mon, 09 Oct 202305:47 AM IST

నేడు షెడ్యూల్ విడుదల

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరికాసేపట్లో విడుదల కానుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల బృందం కసరత్తును పూర్తి చేసింది. ఏర్పాట్లు పూర్తి కావడంతో ఎన్నికల షెడ్యూల్‌ను నేడు విడుదల చేయనున్నారు.

Mon, 09 Oct 202305:47 AM IST

మరికాసేపట్లో ఎన్నికల షెడ్యూల్

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది.అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనున్నారు.