Telangana Voter List : తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదల - మొత్తం లెక్క ఇదే
Telangana Voter List: తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది.
Telangana Voters List : తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లండించింది. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,58,71,493గా ఉండగా… మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339 గా ఉందని ఈసీ పేర్కొంది.
జనవరితో పోలిస్తే 5,8 శాతం ఓటర్ల సంఖ్య పెరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 6.10 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు తెలిపింది. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి 998:1000గా ఉందని ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 2,557 గా ఉన్నట్లు పేర్కొంది. తుది జాబితా ప్రకటించినప్పటికీ... ఓటర్ల జాబితాను ఆధునీకరించే కసరత్తు కొనసాగుతుందని ఈసీ తెలిపింది. అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. eci.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ బృందం సమీక్షింస్తోంది. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ రాజీవ్ కుమార్ బృందం సమావేశమైంది. గురువారం తెలంగాణ సీఎస్, డీజీపీతో సీఈసీ బృందం భేటీ కానుంది. అనంతరం ఎన్నికలకు సంబంధించి సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నెల 6 లేదా 7వ తేదీ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.