TG EAP CET Sliding: నేటి నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో స్లైడింగ్, లాసెట్‌, ఎడ్‌సెట్‌ కౌన్సిలింగ్ గడువు పెంపు-extension of sliding and lawset counseling deadline in engineering courses in telangana from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Eap Cet Sliding: నేటి నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో స్లైడింగ్, లాసెట్‌, ఎడ్‌సెట్‌ కౌన్సిలింగ్ గడువు పెంపు

TG EAP CET Sliding: నేటి నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో స్లైడింగ్, లాసెట్‌, ఎడ్‌సెట్‌ కౌన్సిలింగ్ గడువు పెంపు

Sarath chandra.B HT Telugu
Aug 21, 2024 08:32 AM IST

TG EAP CET Sliding: తెలంగాణలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు నేటి నుంచి స్లైడింగ్‌కు అనుమతిస్తారు. కన్వీనర్ కోటాలో ఇప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థులు మరో బ్రాంచిలో చేరేందుకు అనుమతిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే స్లైడింగ్ చేపడుతున్నట్టు కన్వీనర్ ప్రకటించారు.

నేటి నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్లలో స్లైడింగ్
నేటి నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్లలో స్లైడింగ్

TG EAP CET Sliding: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులు బ్రాంచిలు మారేందుకు అవకాశం కల్పించే స్లైడింగ్‌ రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో ఈఏపీ సెట్‌ 2024 ద్వారా బీటెక్ సీట్లు ఎంచుకుని, ఇప్పటికే కళాశాలల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో అందబాటులో ఉన్న మరో బ్రాంచికి మారే అంతర్గత స్లైడింగ్ ప్రక్రియను బుధవారం నుంచి చేపడతారు.

ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్లైడింగ్ నిర్వహిస్తున్నారు. బ్రాంచి మారినా ఫీజు రియింబర్స్‌మెంట్‌ ద్వారా లబ్ది పొందేందుకు అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ సీట్ల తుది జాబితాను బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు విద్యార్థులు తమ ఆప్షన్లు నమోదు చేసుకో వాలని, కోర్సులు మారాలనుకునే విద్యార్ధులకు ఈనెల 24వ తేదీన సీట్లు కేటాయిస్తామని ఇంజి నీరింగ్ కోర్సుల ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన ప్రకటించారు. స్లైడింగ్‌లో కొత్త బ్రాంచిలలో సీట్లు పొందిన వారు ఈనెల 25వ తేదీలోగా అందులో చేరాల్సి ఉంటుంది.

లాసెట్‌ కౌన్సిలింగ్ పొడిగింపు…

తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు. ఆగస్టు 20వ తేదీతో కౌన్సిలింగ్ గడువు ముగిసినా దానిని 24వ తేదీ వరకు పొడిగించారు. కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలో ఉన్న పలు లా కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నుంచి అనుమతి రాకపోవడంతో కౌన్సిలింగ్ గడువును పొడిగించారు. 24వ తేదీ లోపు బీసీఐ అనుమతి వచ్చిన కళాశాలలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

ఎడ్‌ సెట్ రిజిస్ట్రేషన్ గడువు…

తెలంగాణ ఎడ్‌ సెట్‌ రిజిస్ట్రేషన్ గడువును ఆగస్టు 23 వరకు పెంచారు. పూర్తి షెడ్యూల్‌ ఎడ్‌ సెట్ 2024 వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు గడువు పొడిగింపును గమనించాలని కన్వీనర్ సూచించారు.

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో వాక్ఇన్‌ కౌన్సిలింగ్…

తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు ఆగస్టు 24వ తేదీన వాక్ ఇన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలి పోయిన డిప్లొమా కోర్సుల సీట్లను రెండో విడత 'వాక్ ఇన్ కౌన్సె లింగ్'‌లో భర్తీ చేయనున్నట్టు రిజిస్ట్రార్ రఘురామి రెడ్డి మంగళవారం తెలిపారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఉన్న వాటర్ టెక్నాలజీ ఎగ్జామినేషన్స్ సెంటర్‌లో అగ్రికల్చర్ డిప్లొమా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పాలి సెట్-2024లో ర్యాంకులు సాధించిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు.పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కూడా నేరుగా అడ్మిషన్ పొందొచ్చు.