DK Aruna : కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు - పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన డీకే అరుణ-dk aruna clarity on joining in congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dk Aruna : కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు - పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన డీకే అరుణ

DK Aruna : కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు - పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన డీకే అరుణ

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 26, 2023 01:58 PM IST

TS Assembly Elections 2023: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు. పార్టీ మారే ఉద్దేశ్యమే తనకు లేదని… కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

డీకే అరుణ
డీకే అరుణ

DK ArunaNews: కాంగ్రెస్ లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు బీజేపీ నేత డీకే అరుణ. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. మోదీ నాయకత్వంలో పని చేసేందుకు అదృష్టం ఉండాలన్నారు. విలువలతో కూడిన రాజకీయం చేసే వ్యక్తినని చెప్పుకొచ్చారు. ఇలాంటి వార్తల విషయంలో మీడియా కూడా తనను సంప్రదించి క్లారిటీ తీసుకోని… వార్తలు ప్రచురిస్తే బాగుండేదని అన్నారు. పార్టీ మారుతున్నట్లు వార్తా కథనాలు రాయటం సరికాదన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా కూడా వేస్తానని తెలిపారు.

“పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని నేను కాదు. ప్రజల కోసం పని చేసే వ్యక్తిని. అధికారం కోసం ఆరాటపడి రాజకీయాలు చేసే వ్యక్తితత్వం నాది కాదు. అహర్నిశలు ప్రజల కోసమే పని చేస్తాను. గెలుపొటముల విషయంలో విలువలు కోల్పోయి రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు” అని డీకే అరుణ చెప్పారు.

కాంగ్రెస్‌ నాయకులు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని అన్నారు డీకే అరుణ. బీజేపీ అధిష్ఠానం నన్ను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో డీకే అరుణ పేరు లేదు. అయితే ఆమె అసెంబ్లీ బరిలో ఉండే విషయంలో ఆసక్తికగా లేనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల బరిలో పోటీ చేయవచ్చని సమాచారం.

మరోవైపు బీజేపీలో మొన్నటి వరకు కీలకంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి…. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో…. వివేక్, డీకే అరుణతో పాటు పలువురు నేతలు కూడా హస్తం గూటికి చేరే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. ఈ క్రమంలోనే డీకే అరుణ పేరు తెరపైకి వచ్చింది. వీటిపై స్పందించిన డీకే అరుణ… తీవ్రంగా ఖండించారు. బీజేపీలోనే కొనసాగుతానని అన్నారు.

Whats_app_banner