TS Assembly Elections: తెలంగాణలో అన్ని పార్టీల్లో ఫిరాయింపులు షురూ…
TS Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 43 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని పార్టీల్లో నేతల వలసలు కొనసాగుతున్నాయి.ఓ పార్టీలో ఒకరు రాజీనామా చేస్తే వారి స్థానంలో మరొకరు ఇతర పార్టీ నుండి చేరుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ఇదే జరుగుతోంది.
TS Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 43 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అన్ని పార్టీల్లో నేతల వలసలు కొనసాగుతున్నాయి.ఓ పార్టీలో ఒకరు రాజీనామా చేస్తే వారి స్థానంలో మరొకరు ఇతర పార్టీ నుండి చేరుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ఇదే జరుగుతోంది.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆయన సతీమణి హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజిత గౌడ్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు.గత కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాలను రెండు మూడు సార్లు ఖండించిన ఆయన ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
మంగళవారం ఉదయం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడనుండి నేరుగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంకు చేరుకొని అక్కడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
పెద్దమ్మ తల్లి ఆలయం వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, తరలి రావాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చారు. జగదీశ్వర్ గౌడ్ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా గెలిచాడు.అనంతరం 2016 లో మాదాపూర్ కార్పొరేటర్ గా టీఆర్ఎస్ నుండి రెండో సారి గెలుపొందారు.
2020 లో మాదాపూర్ నుండి జగదీశ్వర్ గౌడ్ మూడోసారి కార్పొరేటర్ గా విజయం సాధించగా హాఫిజ్ పేట్ నుండి అయన సతీమణి పూజిత కార్పొరేటర్ గా పోటీ చూసి గెలుపొందారు. ఈ రెండు డివిజన్ల లో జగదీశ్వర్ కు మంచి పట్టు ఉండటంతో వీరు కారు దిగడంతో బిఆర్ఎస్ పార్టీకి మాదాపూర్, హాఫిజ్ పేట్ లో గట్టిగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు.
గత కొన్ని రోజులుగా జగదీశ్వర్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీని విడుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు పంపారు.ఈ క్రమంలోనే ఆయా డివిజన్లలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా నాయకులెవరూ బిఆర్ఎస్‌ను వీడకుండా ఎమ్మెల్యే అరికపుడి గాంధీ వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు
సోమవారం బోధన్ బిఆర్ఎస్ మునిసిపల్ ఛైర్పర్సన్ పద్మావతి శరత్ రెడ్డి లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ బీఆర్‌ఎస్ నేత ఆకుల లలిత కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.
రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్