Karimnagar Cybercrime: కరీంనగర్‌లో సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు, నిందితుల అరెస్ట్
Karimnagar Cybercrime: ఉద్యోగాల పేరిట సైబర్ నేరాలను ప్రోత్సహించే ముఠా గుట్టు రట్టయింది. ముఠాకు చెందిన ఇద్దర్ని ఇదివరకే సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేయగా తాజాగా మరొకరిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన పోలీసులు అదుపులోకి తీసుకుని సైబర్ నేరగాళ్ళ వివరాలు సేకరించి అరెస్టు చేశారు.
Karimnagar Cybercrime: ఉద్యోగాల పేరిట సైబర్ నేరాలను ప్రోత్సహించే ముఠా గుట్టు రట్టయింది. ముఠాకు చెందిన ఇద్దర్ని ఇదివరకే సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేయగా తాజాగా మరొకరిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన పోలీసులు అదుపులోకి తీసుకుని సైబర్ నేరగాళ్ళ వివరాలు సేకరించి అరెస్టు చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే పనిలో సిరిసిల్ల పోలీసులు నిమగ్నమయ్యారు.
ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర వేసి డబ్బులు వసూలు చేస్తూ కంబోడియాకు పంపించే చైన్ నెట్ వర్క్ వెలుగులోకి వచ్చింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని ఏజెంట్లుగా పెట్టుకుని ఒక్కొక్కరికి రూ.
వారికి రూ.10 వేలకు పైగా కమిషన్ ఇస్తూ ఉద్యోగాల పేరిట కంబోడియాకు రప్పించుకుంటున్నారు. ఒకరి నుండి మరోకరి అకౌంట్లకు బాధితుల నుండి కలెక్ట్ చేసిన డబ్బులు బదిలీ చేసేవారు. దీంతో అంతా మీడియేటర్లుగానే వ్యవహరిస్తుండడంతో పాటు కంబోడియాలో నిరుద్యోగులచే ఎలాంటి పనులు చేయిస్తారో కూడా అర్థం కాకుండా అక్కడ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసిన చెనీయులు భారత్ నుండి వెళ్ళిన నిరుద్యోగుల పాస్ పోర్టులు లాక్కుని రోజుకు 17 గంటల వరకు పని చేయించేవారు.
అయితే వీరంతా కూడా అక్కడకు చేరుకున్న తరువాత కాల్ సెంటర్లలో చేసేది ఉద్యోగం కాదు... సైబర్ నేరాలకు పాల్పడి డబ్బులు అక్రమంగా బదిలీ చేయించుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని వారికి ఫోన్ చేసి వారి వారి అకౌంట్ల నుండి డబ్బులు బదిలీ చేసుకోవడం వంటి నేరాలు చేయించే వారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బాధితుడు ఒకరు తెలిపారు.
సిరిసిల్ల ఎస్పీ చొరవతో వెలుగులోకి…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను మే 15న ఓ మహిళ సంప్రదించారు. తన కొడుక్కు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి కంబోడియాలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని కొడుకు ఫోన్ లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడని చెప్పారు. ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవ తీసుకుని కంబోడియాలో చిక్కుకున్న ఆమె కొడుకుతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
కంబోడియాలోని ఎంబసీ అదికారులతో మాట్లాడి అక్కడి సైబర్ క్రిమినల్స్ చెర నుంచి విడిపించి స్వస్థలానికి రప్పించారు. అయితే అంతటితో ఆగకుండా ఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. ఇదే తరహాలో ఏపీకి చెందిన వారిని కూడా కంబోడియాకు తీసుకెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం సీపీ రవి శంకర్ అయ్యన్నార్ చొరవ తీసుకుని వందలాది మంది యువకులను స్వస్థలాలకు రప్పించారు.
తీగలాగితే డొంక కదిలింది…
కంబోడియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పి మోసం చేసిన ముఠా గురించి సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆరా తీశారు. బాధితునికి ఉద్యోగం ఎరగా వేసి రూ. లక్షా 50 వేలు వసూలు చేసిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన కె.సాయిప్రసాద్ ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత మహారాష్ట్రలోని పూణేకు చెందిన మహ్మద్ అబిద్ హుస్సేన్ అన్సారీని అరెస్ట్ చేశారు.
తాజాగా ఈ కేసులో నిందితునిగా ఉన్న బీహార్ చెందిన మహ్మద్ షాదాబ్ ఆలంను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన పోలీసులు విచారించి చైన్ నెట్వర్క్ సంబంధించి సైబర్ నేరగాళ్ళ చైన్ నెట్వర్క్ సంబంధించి వివరాలు సేకరించి అతన్ని అరెస్టు చేశారు.
ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేయండి..
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటూ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి పిర్యాదు చేయాలన్నారు.
మన బలహీనతనే సైబర్ నేరగాళ్ల బలం అని తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవడం ,మన ప్రమేయం లేకుండా వచ్చే ఓటిపి షేర్ చేయడం, ఆన్లైన్ లో ఉద్యోగాల కోసం వెతకడం,ఆన్లైన్ కస్టమర్ కేర్ నంబర్స్ వెతకడం,మొబైల్ ఫోన్ కి వచ్చే అనుమానిత లింక్స్ పెరితో ఎరవేసి క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బుకు ఊడ్చేస్తారని, ఇలాంటి సైబర్ మోసాలు ఎక్కవగా జరుగుతున్నయని, ఇట్టి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా కోరారు.
సైబర్ మోసగాల్లో చేతిలో మోసపోయిన బాధితుల కోసం ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ వారియర్స్ ని నియమించడం జరిగిందని సైబర్ నేరాలకు గురైనవారు నేరుగా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదా ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చని తెలిపారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)