Minister HarishRao : కర్ణాటకలో దొరికిన రూ.42 కోట్లు - తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల కోసమే రెడీ చేశారన్న హరీశ్
TS Assembly Elections 2023: కర్ణాటకలో దొరికిన రూ. 42 కోట్లను తెలంగాణలో ఖర్చు పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు మంత్రి హరీశ్. ఇలాంటి పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.
TS Assembly Elections 2023: బెంగుళూరులోని కాంగ్రెస్ నేత ఇంట్లో దొరికిన రూ. 42 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో వారి అభ్యర్థుల కోసం రెడీ గా పెట్టారని… మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ రోజు మెదక్ జిల్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా బిల్డర్ల నుంచి, కాంట్రాక్టర్ల నుండి, బంగారం, బిజినెస్ చేసేవారి నుండి రూ 1,500 కోట్లు వసూలు చేసి పెట్టిందన్నారు. అవే డబ్బులను తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖర్చుల కోసం పంపాలని నిర్ణయం తీసుకున్నారని… సీరియస్ కామెంట్స్ చేశారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ టాక్స్ అని వ్యాపారుల దగ్గర నుంచి వాసులు చేస్తుందని విమర్శించారు మంత్రి హరీశ్. ఇంతకు ముందు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీజేపీ నాయకులూ 40 శాతం కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించిన అంబికాపతి ఇంట్లోనే ఈ డబ్బులు దొరకటం గర్హనీయమని అన్నారు. ఇప్పుడు కర్ణాటకని పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వం… 50 శాతం కమీషన్లు తీసుకుంటుందన్నారు. ఈ డబ్బును బెంగుళూర్ నుంచి చెన్నైకి అక్కడి నుంచి హైదరాబాద్ కి తరలించి కాంగ్రెస్ అభ్యర్థులకు పంచాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందన్నారు. కర్ణాటకలో ప్రతి SFT కి 75 రూపాయల పన్నును కాంగ్రెస్ నాయకులు బిల్డర్ల నుండి వసూలు చేస్తున్నారని, అప్పుడే నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నారని అన్నారు. కర్ణాటక అంతటా అవినీతిమయం అయ్యిందన్నారు. అక్కడ వసూళ్ల నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణాలో ఖర్చు చేయాలని చూస్తున్నారని…. అది కాంగ్రెస్ కాదు స్కాంగ్రేస్అ ని ఆయన ఎద్దేవా చేసారు.
ఇలాంటి పార్టీలను నమ్మరు..…
తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులోను ఇలాంటి పార్టీలను నమ్మరని, డబ్బులకు తమ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజలు తాకట్టు పెట్టారని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ఇప్పటివరకు తమ అభ్యర్థులను ప్రకటించలేకపోయిందని…, కాంగ్రెస్ పార్టీ డబ్బుల సంచులతో పార్టీలో చేరిన వారికే టిక్కెట్లు ఇస్తుంది ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో ఎన్నో స్కీములు తెస్తామని చెప్పి , ఎన్నికల్లో గెలిసినంక కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందన్నారు.
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలను కూడా గులాబి కండువా కప్పి పార్టీలోకి మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువని పక్కా పార్టీల దిక్కు చూస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. షెడ్యూల్ వచ్చినా టికెట్లు డిక్లేర్ చేసుకోలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీదని వ్యాఖ్యానించారు.
రిపోర్టర్ : ఉమ్మడి మెదక్ జిల్లా