KCR Birthday Wishes : కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ బర్త్‌డే విషెస్‌ - అసెంబ్లీలో ప్రకటన, ఏమన్నారంటే..-cm revanth reddy conveyed birthday greetings to brs chief kcr in assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Birthday Wishes : కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ బర్త్‌డే విషెస్‌ - అసెంబ్లీలో ప్రకటన, ఏమన్నారంటే..

KCR Birthday Wishes : కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ బర్త్‌డే విషెస్‌ - అసెంబ్లీలో ప్రకటన, ఏమన్నారంటే..

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 17, 2024 01:09 PM IST

CM Revanth Reddy Greetings to KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కలిసిరావాలని ఆకాంక్షించారు.

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ బర్త్‌డే విషెస్‌ - అసెంబ్లీలో ఏమన్నారంటే..
కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ బర్త్‌డే విషెస్‌ - అసెంబ్లీలో ఏమన్నారంటే..

CM Revanth Reddy Greetings to KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. గత బీఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులలోని లోపాలను ఎత్తిచూపుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత…. ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పారు.

yearly horoscope entry point

“ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రాజకీయాల్లో నాలుగు దశాబాద్ధాలుగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నేతగా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతున్నాను. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్పై రూపొందించిన డాక్యూమెంటరీని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.

ఇవాళ(ఫిబ్రవరి 17) కేసీఆర్ పుట్టినరోజు కావటంతో... పలు రాజకీయ నేతలు, సినీ ప్రముఖలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈసారి వేడుకలకను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించింది బీఆర్ఎస్. 1000 మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య బీమా పత్రాలను అందించనుంది. అంతేకాకుండా వికలాంగులకు వీల్‌ఛైర్స్‌ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. కేసీఆర్ జన్మదిన వేడుకలను అన్ని గ్రామాల్లోనూ ఆ పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానూ పోస్టులు చేస్తున్నారు.

Whats_app_banner