KCR Asifabad Tour: నేడు ఆసిఫాబాద్‌లో సిఎం కేసీఆర్ పర్యటన-cm kcr who will visit asifabad today will distribute the pattas to dry lands ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Asifabad Tour: నేడు ఆసిఫాబాద్‌లో సిఎం కేసీఆర్ పర్యటన

KCR Asifabad Tour: నేడు ఆసిఫాబాద్‌లో సిఎం కేసీఆర్ పర్యటన

HT Telugu Desk HT Telugu
Jun 30, 2023 07:18 AM IST

KCR Asifabad Tour: తెలంగాణ సిఎం కేసీఆర్‌ శుక్రవారం కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లా కేంద్రంలో గోండు వీరుడు, సాయుధ తెలంగాణ పోరాట యోధుడు కుమ్రం భీమ్ విగ్రహాన్ని సిఎం ఆవిష్కరిస్తారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి తర్వాత పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

తెలంగాణ  సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్

KCR Asifabad Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు ఆసిఫాబాద్‌లో పోడు భూములకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. పలు జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతులకు పట్టాలను మంజూరు చేస్తారు. రైతులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ, అటవీ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

శుక్రవారం ఆసిఫాబాద్‌ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భూముల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులకు పట్టాలు అందజేయనున్నారు. మిగతా జిల్లాల్లో జిల్లా మంత్రుల చేతుల మీదుగా అర్హులకు పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తారు.

పోడు భూముల్లో సాగుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 1,50,012 మంది రైతులు 4,05,601 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గిరిజనులు, ఆదివాసీలుగా నిర్ధారించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 50,595 మంది రైతులు 1,51,195 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 24,972 మంది రైతులు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 15,254 మంది రైతులు పట్టాల కోసం దరఖాస్తులు సమర్పించారు.

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ గోండు వీరుడు, సాయుధ తెలంగాణ పోరాట యోధుడు కుమ్రం భీమ్ విగ్రహాన్ని సిఎం ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో కోట్నక్ భీమ్రావు విగ్రహావిష్కరణ చేస్తారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం ప్రారంభానికి సిద్ధంగా వున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదా యానికి చేరుకొని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత లబ్ధిదారులకు పోడుపట్టాలను అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని సిఎం ప్రసంగిస్తారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌కు బయలుదేరతారు. పట్టణంలో తొలుత కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సమీపంలోని పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కోట్నాక భీంరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, చివరగా కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 6.25 గంటలకు తిరిగి ప్రగతిభవన్‌ చేరుకోనున్నారు.

Whats_app_banner