TS New High Court: నూతన తెలంగాణ హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన చేయనున్న సీజేఐ చంద్రచూడ్-cji chandrachud will lay the foundation stone for the new telangana high court building today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts New High Court: నూతన తెలంగాణ హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన చేయనున్న సీజేఐ చంద్రచూడ్

TS New High Court: నూతన తెలంగాణ హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన చేయనున్న సీజేఐ చంద్రచూడ్

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 10:09 AM IST

TS New High Court: తెలంగాణలో నూతన హైకోర్టు భవనానికి చీఫ్‌ జస్టిస్ ఆఫ్ ఇండియా నేడు శంకుస్థాపన చేయనున్నారు. హైకోర్టు నిర్మాణానికి 100ఎకరాల భూమిని రాజేంద్రనగర్‌లో కేటాయించారు.

తెలంగాణలో కొత్త హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన చేయనున్న సీజేఐ
తెలంగాణలో కొత్త హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన చేయనున్న సీజేఐ

TS New High Court: తెలంగాణలో నూతన హైకోర్టు High court భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ Chandra Chud నేడు శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ Rajendra Nagar మండలం బుద్వేల్‌లో కొత్త భవనాలను నిర్మించనున్నారు.

శంకుస్థాపన కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదేతో సమా వేశం సందర్భంలో కొత్త భవన నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు సిఎం రేవంత్ సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో భూమి కేటాయింపు కోరుతూ న్యాయశాఖ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

రాజేంద్రనగర్‌ వ్యవసాయవిశ్వవిద్యాలయానికి బుద్వేల్‌ Budwelలో ఉన్న100 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం గత డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టును కొత్త భవనంలోకి తరలించాక పాత హైకోర్టు భవనాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానిని సివిల్ కోర్టు అవసరాలకు వినియోగిస్తామని సీఎం రేవంత్ ప్రకటిం చారు.

తెలంగాణ హైకోర్టులో 2009లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పట్లోనే పాతబస్తీ నుంచి హైకోర్టును తర లించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైకోర్టు నిర్మాణానికి బుద్వేల్‌తో పాటు చంచల్‌ గూడ సమీపంలోని ప్రింటింగ్ ప్రెస్ ప్రాంగణం, సోమాజిగూడ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.

ప్రస్తుతం హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మిస్తారు. శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్ర చూడ్‌తో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, న్యాయమూర్తులు, న్యాయాధికారులు హాజరు కానున్నారు.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో శంకుస్థాపనకు రాజకీయ నాయకులు ఎవరూ పాల్గొనే అవకాశం లేదు. హైకోర్టు కొత్త భవనాన్ని వందేళ్లపాటు పటిష్ఠంగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సుమారు 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. న్యాయమూర్తుల సంఖ్యకు అనుగుణంగా గదులు, కోర్టు హాళ్లను నిర్మిస్తారు. జడ్జిల నివాస భవనాలు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌, ఆడిటోరియం, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, ఫైలింగ్‌ సెక్షన్‌లు, రికార్డు గదులు, పార్కింగ్‌ క అవసరాలకు అనుగుణంగా ప్లాన్ ఖరారు చేస్తారు. హైకోర్టు నూతన భవనం వరకు మెట్రోరైలును పొడిగిస్తారు.

వందేళ్ళ క్రితం నిర్మాణం…

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు భవనాన్ని 1919లో నిర్మించారు. మూసీ నది ఒడ్డున మదీన వద్ద ఉన్న హైకోర్టు భవనాన్ని ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ నిర్మించారు. భారత దేశంలో హైదరాబాద్‌ రాష్ట్రం విలీనం కాకముందు హైదరాబాద్‌ హైకోర్టుగా దీనిని వ్యవహరించేవారు.

సంబంధిత కథనం