తెలుగు న్యూస్ / ఫోటో /
BRS Protests On Gas Price: 'సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు'.. గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆందోళనలు
- BRS stage protests: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి నినాదాలు చేస్తూ… గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలీ, నేతలు, మహిళ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

(1 / 5)
సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
(2 / 5)
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ నార్కట్ పల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
(3 / 5)
హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… గ్యాస్ ధరలను పెంచటం దారుణమన్నారు. వెంటనే కేంద్రప్రభుత్వం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
(4 / 5)
ధరల పెంపును నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు.
ఇతర గ్యాలరీలు