KCR Campaign : రైతుబంధు దుబారా అంటున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి - ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
CM KCR Election Campaign: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్ లో పర్యటించిన ఆయన… సాయంత్రం వర్ధనపేట సభలో ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు.
CM KCR Election Campaign: అసెంబ్లీ ఎన్నికల వేళ గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు పెంచారు. దసరాకు ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్… రెండో విడత ప్రచారంలోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం ఒకే రోజు మూడు సభలకు హాజరైన ఆయన… ఇవాళ కూడా మూడు సభల్లో పాల్గొన్నారు. తొలుత పాలేరు, మహబూబాబాద్ సభలో ప్రసంగించిన ఆయన.. చివరగా వర్థనపేట సభలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేశ్ ను గెలిపించాలని కోరారు.వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.
వర్ధన్నపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ :
-వర్థన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ గెలిపించాలి. రింగు రోడ్డు పేరుతో రమేశ్ పై కుట్రలు చేస్తున్నారు. రింగు రోడ్డు పేరుతో ఎవరి భూమలుు తీసుకోం. ఈ విషయంలో నేను హామీనిస్తున్నారు.
- రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరీ ఈ స్కీమ్ ఉండాలా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో నాయకుడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నాడు. 24 గంటల కరెంట్ ఉండాలా..? వద్దా...?
- రైతుబంధు, దళితబంధు పదాన్ని సృష్టించిందే కేసీఆర్. అంతకుముందు ఎలాంటి బందు లేదు. రైతుబంధు వద్దన్న వాళ్లకు బుద్ధి చెప్పాలి.
- వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం.
- ఆరోగ్య బీమా ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యం ఇస్తాం. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేశాం. వాగులపై చెక్ డ్యామ్ లు కట్టుకున్నాం.
- ఆరూరి రమేశ్ మెజార్టీ లక్ష దాటాలని కోరుతున్నాను. నా కంటే కూడా ఎక్కువ మెజార్టీ రావాలి.
- రైతుబిడ్డగా భూములపై హక్కులు ఉండాలని ధరణిని తీసుకొచ్చాం. రైతులకే హక్కులు ఇచ్చాం. మార్చే అధికారం ముఖ్యమంత్రికే లేదు. రిజిస్ట్రేషన్లను కూడా సులభతరం చేశాం. కాంగ్రెస్ వస్తే ధరణిని రద్దు చేస్తామని అంటున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మళ్లీ లంచాలు మొదలవుతాయి.
- రైతుబంధు స్కీమ్ ను శాస్త్రవేత స్వామినాథన్ తో పాటు యూఏన్ వో కూడా ప్రశంసించింది.
- తెలంగాణలో కరెంట్ కష్టాలు పోయాయి. ఈ విషయాలను ప్రజలు గుర్తుంచుకోవాలి.
-లంబాడీల గురించి కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. ధరణి రద్దు, 3 గంటల కరెంట్ అని చెబుతూ వాళ్ల కడుపులోని విషాన్ని బయటపెడుతున్నారు.
- దళితులు, బీసీలు, ముస్లిం, గిరిజనుల కోసం రెసిడెన్షియళ్లను ఏర్పాటు చేశాం. జిల్లాకో మెడికల్ కాలేజీని ఇచ్చాం.
- వర్ధన్నపేటలో ఉన్న సాదాబైనామాలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను. ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తాం. రాబోయే రోజుల్లో అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.
- మీ మధ్యలోనే ఉండి ప్రజల మనిషిగా ఉండే ఆరూరి రమేశ్ ను గెలిపించాలి. వర్ధన్నపేటపై గులాబీ జెండా ఎగరాలి.